1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. NBK111 Birthday Treat: Stylish with a Gun Culture Vibe

NBK111 Birthday Treat: గన్ కల్చర్ తో స్టయిలిష్ గా NBK111 బర్త్ డే ట్రీట్‌

NBK111 Birthday Treat
NBK111 Birthday Treat
నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK111 చిత్రం గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. గన్ పట్టుకుని బైక్ పై రౌండ్లు వేస్తూ సాగిన యాక్షన్ సీన్స్ స్టయిలిష్ గా వున్నాయి. థమన్ సంగీత సారథ్యంలో సాగిన నేపథ్యం ఓజీ తరహాలో అనిపించినా బాలయ్య కోసం బాక్స్ లు బద్దలయ్యేట్లుగా సౌండ్ ను పొందుపరిచారు. అభిమానులకు ట్రీట్ గా వుందనిపించింది.
 
1 నిమిషం 31 సెకన్ల నిడివితో వచ్చిన గ్లింప్స్ లో బాలక్రిష్ణ సరికొత్త లుక్స్, ఆయన బాడీ లాంగ్వేజ్ మైస్మరైజ్ చేశాయి.  గోపీచంద్ మలినేని తన దర్శకత్వం శైలితోపాటు యాక్షన్ కొరియోగ్రఫీ హాలీవుడ్ స్థాయిలో వున్నట్లుగా అనిపిస్తుంది. న్యూ ఏజ్ బాలయ్యను మనకు చూపెట్టాడు. బాలయ్య మాస్ ఇమేజ్‌కు థమన్ ఇచ్చిన సౌండింగ్ అభిమానుల్లో రీసౌండ్ క్రియేట్ చేస్తోంది.
 
ఇక ఈ సినిమాలో  కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుండగా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
కనకవర్షం కురిపిస్తున్న రామ్ చరణ్ 'పెద్ది'