సంబంధిత వార్తలు
- NTR: నైజం హక్కులతో రామ్ చరణ్ కు పెద్ది చిత్రం మరో రచ్చ చేస్తుందా !
- Biker Review: బైక్ రేసింగ్ రైడ్ తో శర్వానంద్, రాజశేఖర్ గట్టెక్కించారా - బైకర్ రివ్యూ
- Sharwanand: తెలుగు ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు హ్యాట్సాఫ్ : శర్వానంద్
- Sharva: గంగలోని ప్రశాంతత క్రోధం భోగి లో చూపించనున్న శర్వానంద్
- Bhogi: శర్వా, సంపత్ నంది చిత్రం భోగి నుంచి మాస్సీ రగ్డ్ ఫస్ట్ లుక్
Sharwanand: శర్వానంద్, సంపత్ నంది చిత్రం భోగి హై-ఆక్టేన్ యాక్షన్ కొత్త షెడ్యూల్
Sharwanand - Bhogi
ఫస్ట్-లుక్ విడుదలకు లభించిన అద్భుత స్పందన నేపథ్యంలో, చిత్ర బృందం ఇప్పుడు రాజమండ్రిలో అత్యంత కీలకమైన, లెన్తీ షెడ్యూల్‌ను ప్రారంభించింది. షూటింగ్ రాంపచోడవరం అడవులలోని కఠినమైన, సవాలుతో కూడిన ప్రదేశాలలో జరగనుంది. ఇక్కడ ఎక్సయిటింగ్, టఫ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
ఈ సన్నివేశాలను ప్రముఖయాక్షన్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షణలో చిత్రీకరిస్తున్నారు. ఇవి ప్రేక్షకులను లీనమయ్యేలా చేసే యాక్షన్ అనుభూతిని అందించనునాయి. ప్రధాన తారాగణంతో పాటు శర్వానంద్ కూడా ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు. ఇది సినిమా నిర్మాణంలో ఒక కీలక ఘట్టంగా నిలుస్తోంది.
“ఎ బ్లడ్ ఫెస్ట్” అనే ఆకట్టుకునే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న భోగి చిత్రంలో శర్వానంద్ ఒక సరికొత్త అవతార్ లో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆయన ట్రాన్స్ ఫర్మేషన్ అంచనాలు పెంచింది.
దర్శకుడు సంపత్ నంది, 1960లో ఉత్తర తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. వాస్తవికమైన కథనం,పవర్ ఫుల్ నేపథ్యంతో ఈ చిత్రం ఇంటెన్స్ డ్రామాతో గొప్ప ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.
ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. కిరణ్ కుమార్ మన్నె ప్రొడక్షన్ డిజైన్, కిషోర్ కుమార్ అరోకియా సినిమాటోగ్రఫీ, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
రక్షా బంధన్ పండుగ సందర్భంగా ఆగస్ట్ 28, 2026న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా థియేటర్‌లలో విడుదల కానుంది.
తారాగణం: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి, రోహిత్ పాఠక్
