1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Nijamena Lyrical Song from Timmarajupalli TV

Kiran Abbavaram: తిమ్మరాజుపల్లి టీవీ నుంచి నిజమేనా లిరికల్ సాంగ్

Sai Tej, Veda Jalandhar
Sai Tej, Veda Jalandhar
హీరో కిరణ్ అబ్బవరం న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా తిమ్మరాజుపల్లి టీవీ. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవు తున్నారు. వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
ఈ రోజు "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా నుంచి 'నిజమేనా' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఎమోషనల్ ఫీల్ తో వంశీకాంత్ రేఖన కంపోజ్ చేశారు. సనరే లిరిక్స్ రాయగా, యువ గాయని జయశ్రీ పల్లెం పాడారు. 'నిజమేనా నిజమేనా నే విన్నది నిజమేనా, నువు పలికిన ఆ మాటే పొరబడి విన్నానా, నిజమేనా నిజమేనా నువ్వన్నది నిజమేనా కను తెరిచి నీ ముందే కలనే కన్నానా, ప్రతి క్షణం నీ వెంటే ఇన్నాళ్లుగా తిరిగానే, నేనేమిటో కొంచెం కూడా అర్థం కాలేదా...' అంటూ  హార్ట్ టచింగ్ గా సాగుతుందీ పాట.
 
నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
తర్వాతి కథనం
ప్రేమ అనేది సర్వస్వం కాదు.. కానీ అది లేకపోతే శూన్యం.. త్రిష