సంబంధిత వార్తలు
- Nikhil: స్వయంభూ విఎఫ్.ఎక్స్. టెక్నీషియన్లను పర్యవేక్షించిన నిఖిల్, సెంథిల్
- Dulquer Salmaan: దుల్కర్ సల్మాన్ స్టైలిష్ థ్రిల్లింగ్ మూవీగా ఐ యామ్ గేమ్
- Nikhil: హీ-మ్యాన్ అండ్ ది మాస్టర్స్ ఆఫ్ ది యూనివర్స్ తెలుగు ట్రైలర్ కు నిఖిల్ సిద్ధార్థ వాయిస్
- Puri Jagannadh: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో విజయ్ సేతుపతి చిత్రం స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్
- Nikhil Siddhartha: నిఖిల్ స్వయంభు షూటింగ్ కష్టాలు !
Nikhil: వియత్నాంలో యుద్ధ విన్యాసాలు నేర్చుకుని స్వయంభూ తో సిద్ధంగా వున్న నిఖిల్
Nikhil Siddhartha
ఇదిలా వుండగా, నేడు నిఖిల్ సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా స్వయంభూ మేకర్స్ విడుదల చేసిన ప్రత్యేక మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ వీడియోలో ఈ ప్రతిష్టాత్మక పీరియడ్ యాక్షన్ డ్రామా కోసం నిఖిల్ చేసిన కఠోర శ్రమను చూపించారు.
వీడియో వియత్నాంలో ప్రారంభమవుతుంది. అక్కడ నిఖిల్ ప్రొఫెషనల్ ట్రైనర్ల పర్యవేక్షణలో కత్తియుద్ధం, స్టాఫ్ కాంబాట్, మార్షల్ ఆర్ట్స్ వంటి యుద్ధ విద్యల్లో కఠినమైన శిక్షణ పొందారు. ఈ క్రమంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయం అయినప్పటికీ, ఆయన వెనక్కి తగ్గకుండా తన ప్రిపరేషన్‌ను కొనసాగించడం విశేషం.
వైర్ యాక్షన్ సీక్వెన్స్‌లు, గాల్లో చేసే విన్యాసాలు, ఫ్లిప్స్, క్లిష్టమైన ఫైట్ మూమెంట్స్‌ను నిఖిల్ సాధన చేస్తున్న దృశ్యాలు వీడియోలో కట్టిపడేశాయి. నెలల తరబడి చేసిన కఠోర సాధన ఫలితంగా సెట్స్‌పై ఆయన అనేక యాక్షన్ సన్నివేశాలను ఎంతో ఆత్మవిశ్వాసంతో పూర్తి చేశారు.
వీడియో చివరి భాగంలో సినిమా నుంచి కొన్ని అద్భుతమైన విజువల్స్‌ను చూపించారు. యుద్ధ కవచం ధరించిన నిఖిల్ శత్రువులపై విరుచుకుపడటం, అగ్నిజ్వాలల మధ్య పోరాడటం, గ్రాండ్ ల్యాండ్‌స్కేప్‌లలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.
ఈ మేకింగ్ వీడియో ద్వారా పాత్ర కోసం నిఖిల్ చూపించిన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాను అత్యంత సహజత్వంతో, భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్న మేకర్స్ విజన్‌ను కూడా ప్రజెంట్ చేస్తోంది.
ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కే.కే. సెంథిల్ కుమార్ అద్భుతమైన విజువల్స్ అందిస్తుండగా, రవి బస్రూర్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఎం. ప్రభాహరన్, రవీంద్ర ప్రొడక్షన్ డిజైన్‌తో చిత్ర ప్రపంచాన్ని మరింత గ్రాండ్ గా తీర్చిదిద్దుతున్నారు.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్న స్వయంభూ త్వరలోనే భారీ పాన్-ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
