Singer Sunitha: లవ్ స్టోరీలో కె.జి.ఎఫ్. లాంటి చిత్రం నిలవే
Soumith Poladi, Sai Ke Vennam, Shreyasi Sen, Kalyan Nayak, Sunitha
సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ సాయి కే వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన చిత్రం నిలవే. శ్రేయాసి సేన్ నాయికగా పరిచయం అవుతుంది. హర్ష చెముడు, సుప్రియా ఐసోలా మరో జంటగా నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కే వెన్నం నిర్మించారు. ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 13న విడుదలకాబోతుంది. ఈ సందర్భంగా బుధవారంనాడు మాదాపూర్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ చిత్ర ట్రైలర్ ను ప్రదర్శించారు.
అనంతరం సింగర్ సునీత మాట్లాడుతూ, ఈ మధ్య చాలా తక్కువ సినిమాల్లో చక్కటి భావోద్వేగాలు చూస్తుంటాం. అన్నీ ఎమోషన్స్ చూపించేలా వున్న చిత్రమే నిలవే. కాలం మారినా ఇంటెన్స్ మ్యూజిక్ అలానే వుంటుంది. నేను ఇక్కడ వుండడానికి కారణం కూడా అదే. నిలవే అనేది అద్భుతమైన ఫొటోగ్రఫీ, దర్శకత్వం, తగిన నటీనటులు వున్న సినిమా ఇది. ఈ సినిమా చూశాను. అర్థవంతమైన సినిమా ఇది. మ్యూజికల్ లవ్ స్టోరీ థియేటర్ లో ఆడేలా ప్రేక్షకులు తీర్పు ఇస్తారనే నమ్మకముంది. ఏ మాయ చేశావే, సఖి లాంటి ఉత్తమ క్లాసిక్ మూవీ ఫీలింగ్ కలుగుతుంది. నాకు ఈ పాటలు బాగా నచ్చాయి. అందుకే ఓసారి కీరవాణిగారిని వినమంటే ఆయన విని తనవంతు సపోర్ట్ ఇస్తానని ప్రమోషన్ చేయడం కూడా సినిమా పై పాజిటివ్ నెలకొంది. ఈ సందర్భంగా అందరికీ మరోసారి విషెస్ చెబుతున్నానని అన్నారు.
హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీ. లో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జంజీ జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ, నేను సినిమాలో వెళుతున్నానని చెప్పినప్పటినుంచీ మా నాన్నగారు ఎంతో సపోర్ట్ చేశారు. నన్ను హీరో, దర్శకుడిగా మార్చింది సాయి కే వెన్నం. చిన్నప్పటినుంచీ నటుడు కావాలనే కోరిక వుండేది. అందుకు నాకు స్పూర్తి మెగాస్టార్ చిరంజీవిగారే. నేను రచయితను కూడా. కరీంనగర్ నుంచి వచ్చాను కాబట్టి నా రచనల్లో ఆ ఛాయలు కనిపిస్తాయి. ఫిబ్రవరి 13న నా తొలి సినిమా విడుదలకాబోతుంది నిన్న ప్రీమియర్ వేశాం. అందరూ చాలా బాగుందని అభినందించారు. రేపు ప్రేక్షకులు కూడా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను. యాక్షన్ లో కె.జి.ఎఫ్. ఎలా వుందో ప్రేమకథతో నిలవే అలా వుంటుంది అని అన్నారు.
చిత్ర దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ, 30 లక్షల్లో మంచి సినిమా తీయవచ్చు. కానీ జనాల్లోకి తేవాలంటే కోట్లు ఖర్చుపెట్టాలని ఆమధ్య ఓ దర్శకుడు అన్నారు. మా సినిమా కంటెంట్ సినిమా. ప్రేక్షకులకు మంచి బిలీవ్ నేను ఇవ్వగలిగాను. నాని గారు కోర్ట్ సినిమా తీశాక చూడండి నచ్చకపోతే నా తదుపరి సినిమా చూడకండి అంటూ బెట్ కూడా వేశారు. కానీ మా దగ్గర అలాంటి బెట్ లు లేవు. మా దగ్గర మంచి సినిమా వుంది. దాన్ని మీరు చూసి ఆశీర్వదించండి. ఇందులో అందరూ కొత్తవారు కావచ్చు. అందరి క్రిషితో ఈ సినిమాను విడుదల చేస్తున్నాం అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్: కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ, చక్కటి ఫీలింగ్ తో కూడిన లవ్ స్టోరీ లో సంగీతం కీలకం. చక్కటి సంగీతాన్ని సమకూర్చాను. మా సంగీతాన్ని మెచ్చుకుని కీరవాణిగారి దగ్గరకు చేరేలా చేసిన సునీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో 11 పాటలున్నా కథతో సాగేవే. వినసొంపుగా వుంటాయి. సంగీత ప్రేమకథా చిత్రాల్లో నిలవే చిత్రం కేజీఎఫ్ లాంటి సినిమా అని తెలిపారు.
నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ, నిన్ననే ప్రీమియర్ వేశాం. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్ దర్శకుడు కూడా పాత్రలో లీనమై మురిపించాడు. ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతితిక సిబ్బంది పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని తెలిపారు.