1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. No one can guess the climax of 'Tathvam' – We overcame many hurdles to reach the release stage: Dinesh Teja

Dinesh Teja: తత్వం క్లైమాక్స్‌ ఎవరూ గెస్‌ చేయలేరు - ఎన్నో కష్టాలు దాటి రిలీజ్ కు వచ్చాం : దినేష్‌ తేజ

Heo Dinesh Teja
Heo Dinesh Teja
తత్వం కథ చాలా కొత్తగా వుంది.  ఈ సినిమా తరువాత కొత్త కథలతో వచ్చే రచయితలకు నేను కూడా ఒక ఆప్షన్‌గా ఉంటాననే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ఫేస్‌ చేసిన స్ట్రగుల్స్‌ ఏ సినిమాకు ఫేస్‌ చేయలేదు.. దర్శక, నిర్మాతలు కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఈ సినిమాను ఈ స్టేజ్‌ వరకు తీసుకొచ్చారు అని హీరో దినేష్‌ తేజ తెలిపారు.
 
అర్జున్‌ కోలా దర్శకత్వంలో దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'తత్వం'  త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్‌.కె.ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో శీమకుర్తి వంశీ కృష్ణ , శ్వేత పసుపులేటీ  ఈ చిత్రాన్ని నిర్మించారు. మర్డర్‌ మిస్టరీ జానర్‌ సినిమాల్లో ఉండే ఉత్కంఠ, స్క్రీన్‌ప్లేతో ఓ వైవిధ్యమైన కథాంశంతో ప్రేక్షకులకు థ్రిల్ల్‌ కలిగించే అంశాలతో రాబోతున్న చిత్రం 'తత్వం'.  ఇటీవల విడుదల ఈ చిత్రం ట్రైలర్‌కు, పాటలకు అనూహ్యమైన స్పందన వచ్చింది. రేపు చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో దినేష్‌ తేజ   బుధవారం పాత్రికేయులతో ముచ్చటించారు.  థ్రియేటికల్‌ విడుదలకు సిద్దమైంది.
 
తత్వం సినిమాను ఒప్పుకోవడానికి రీజన్‌ ఏమిటి?
ఈ సినిమాలో ఎవరూ గెస్‌ చేయలేని ట్విస్ట్‌లు.. క్లైమాక్స్‌లో ఉండే ఎమోషన్‌.. తనకు తాను ఏమీ తెలుసుకున్నాడు  తనకు ఏమీ తత్వం బోదపడింది అనే పాయింట్‌తో పాటు  టోటల్‌ ఈ మర్డర్‌ మిస్టరీ థ్రిల్లర్‌ కొత్తగా అనిపించింది. రేపు థియేటర్‌లో జనాలు కూడా అదే ఫీలవుతారు.
 
ఇది ఎలాంటి కథ?
మూడనమ్మకంకు నమ్మకం మధ్య ఓ సన్నని గీత ఉంటుంది. దాని చుట్టే ఈ కథ తిరగుతుంది. 2000వ సంవత్సరంలో నడిచే కథ ఇది.
 
ఈ సినిమా సమయంలో మీకు యాక్సిడెంట్‌ జరిగిందని తెలిసింది?
ఈ సినిమాకు జరిగిన నెగెటివ్‌లతో అన్నీ ఈ సినిమాకు దిష్టి పోయింది అనుకుంటున్నాం. మా సినిమా కంటెంట్‌ చాలా గట్టిది. ఈ సినిమా ప్రమోషన్‌ టైమ్‌లో నాకు హీరోయిన్‌కు యాక్సిడెంట్ జరిగింది. నాకు ఇది సెకండ్‌ లైఫ్‌. డే వన్‌ రోజు కథ విన్నప్పుడు నాలో ఎలాంటి నమ్మకం ఉందే ఈ రోజుకు అంతకు మించి ఈ చిత్రం విజయంపై విశ్వాసం ఉంది. ఆడియన్స్‌కు సినిమా తప్పకుండా నచ్చుతుంది. అందరూ నన్ను నీ ఫ్రైడే ఎప్పుడూ నీ టైమ్‌ ఎప్పుడూ అంటుంటారు.. తప్పకుండా ఈసినిమాతో ఆ రోజు వస్తుంది. నిజాయితీగా నా పని నేను చేసుకుంటూ మంచి సినిమాల్లో నటిస్తాను. కొత్తదనం ఉన్న సినిమాలు తెలుగు ఆడియన్స్‌ ఆదరిస్తుంటారు. తప్పకుండా  ఈ సినిమాను కూడా అదే కోవలో విజయాన్ని ఇస్తారని అనుకుంటున్నాను. ఈ సినిమాకు కథే మా ధైర్యం, ఆడియన్సే మా బలం. ఇలాంటి సినిమాలు విజయం సాధిస్తే మా అందరిలో కూడా నమ్మకం కలుగుతుంది. ఈ సినిమా క్లైమాక్స్‌ అందరి మనసులను తాకుతుంది
 
మీరు ఎదురుచూస్తున్నకమర్షియల్‌ సక్సెస్‌ ఈ సినిమాతో వస్తుందని అనుకుంటున్నారా?
 కమర్షియల్‌ సక్సెస్‌ ఒక్కటే చూడటం లేదు. కొన్ని సినిమాలు చేస్తున్నప్పుడు. ఈ కథ చెప్పాలని అనిపించి చేసిన సినిమా. ఇది కూడా నావెల్టీ కథ కాబట్టి చేశాను. ఇది నటుడిగా నాకు పూర్తి సంతృప్తి నిచ్చిన సినిమా ఇది. ఇలాంటి కథలు చేయడం వల్ల ఆడియన్స్‌లో మంచి రెస్పెక్ట్‌ వస్తుంది.
 
మీకు ఈ సినిమాలో పాత్ర పర్సనల్‌గా ఎంత వరకు శాటిస్‌ఫాక్షన్‌ ఇచ్చింది?
పర్సనల్‌గా నేను ఏ రోల్‌ చేసిన పూర్తి సంతృప్తిగానే చేస్తాను. హాండ్రెడ్‌ పర్సెంట్‌ న్యాయం చేస్తాను.
 
వెబ్‌సీరిస్‌లు ఒప్పుకోవడం లేదా?
ఓటీటీ వెబ్‌సీరిస్‌ ఆఫర్లు వచ్చాయి. అంత శాటిస్‌ఫాక్షన్‌ కథలు రాలేదు. అందుకే ఒప్పుకోలేదు.
 
ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?
హుషారు -2తో పాటు విజయనగరం బ్యాక్‌డ్రాప్‌తో ఓ యాక్షన్‌ డ్రామా చేశాను. సతీష్ వెగేశ్న కథా కేళి ఉంది
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Venkatesh: ప్యాచ్ వర్క్ షూట్ లో ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47 - AK47’ చిత్రం