1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Not a single person paid attention to me; my ego was hurt: Superstar Rajinikanth (Video)

నన్ను ఒక్కరు కూడా పట్టించుకోలేదు, నా ఇగో హర్ట్ అయ్యింది: రజినీకాంత్

Rajinkanth-SriSri Ravishankar
సినిమా హీరోల్లో దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ స్టైలే వేరు. అంతేకాదు... ఆయన ఆధ్యాత్మిక చింతన కూడా హైలో వుంటుంది. వీలు దొరికినప్పుడల్లా ఆయన హిమాలయాలకు వెళ్లివస్తుంటారు. మానవ జన్మ గురించి ఆయన తత్వ బోధనలు కూడా చెబుతుంటారు. ఇక అసలు విషయానికి వస్తే... ఇటీవల ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, శ్రీశ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకల వేళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడ వున్న ఆధ్యాత్మిక వాతావరణాన్ని, తన అనుభవాన్ని పంచుకున్నారు. ఆయన మాటల్లోనే... శ్రీశ్రీ రవిశంగర్ గురూజీ ఆశ్రమం ఎంతో ప్రశాంతంగా వుంది. చుట్టూ చెట్లూచేమలు, మైమరిచిపోయే పచ్చదనం. ఎటు చూసినా అందరూ ఆనందంగా నవ్వుతున్నారు. వారిలో కార్మికులున్నారు, సెలబ్రిటీలున్నారు.
 
ఇంకోవైపు ఏనుగులు, గుర్రాలు, వందలకొద్దీ ఆవులు. అక్కడ ప్రత్యేకంగా 2 గుర్రాలు వున్నాయి. ఒక గుర్రం పేరు రజినీ. ఇక బాలురు.. నచికేత, ప్రహ్లాదలు. హిమాలయాల తర్వాత నేను ఎంతగానో ఎంజాయ్ చేసిన చోటు ఇదే. ఇక్కడకు 2 రోజులు అనుకుని వచ్చాను. తెలియకుండానే 15 రోజులు వుండిపోయాను. శ్రీశ్రీ రవిశంకర్ గురూజీ గారు తనతో పాటు భక్తులను సందర్శించేందుకు రమ్మన్నారు. నేను ఆయనతో అన్నాను. నేను మీతో వస్తే కాస్త డిస్టర్బ్ అవుతుందని. అభిమానులు రజినీగారు ఆటోగ్రాఫ్, ఫోటోలు అంటూ ఎగబడతారు అని అన్నాను. ఆయన చిరునవ్వుతో డిస్టర్బెన్స్ ఏమీ వుండదు. మీరు నాతో వచ్చేయండి అన్నారు.
 
గురుదేవ్ గారు ఎడమవైపున నేను ఆయన పక్కనే కూర్చున్నాను. మీకు చెబితే నమ్మరు. నన్ను ఒక్కరు కూడా విష్ చేయలేదు, అస్సలు పట్టించుకోలేదు. నా ఇగో హర్ట్ అయ్యింది. బైట ప్రపంచంలో నేను వెళితే నాచుట్టూ ఎంతోమంది గుమిగూడతారు. కానీ ఇక్కడ అదేమీలేదు. ఒకానొక సమయంలో కొందరికి నేను చేయి ఊపుతూ హాయ్ అని చెప్పినా ఎవ్వరూ పట్టించుకోలేదు. అప్పుడు అర్థమైంది నాకు. గురూజీ చెప్పిన నో డిస్టర్బెన్స్ మాటకు అర్థం ఏమిటన్నది.
 
స్టార్ డమ్ వస్తుంది పోతుంది. కానీ స్పిరిట్యువాలిటీ అనేది నిజమైన స్టార్‌డమ్. ఇది మరణించిన తర్వాత కూడా మల్టిపుల్ అవుతుంది. చిరస్మరణీయం చేస్తుంది. మానవుని జన్మ ఎంతో అద్భుతమైనది. దానిని దుర్వినియోగం చేయవద్దని గురూజీ చెబుతారు. నిజంగా ఒక మంచి గురువును పొందడం చాలా కష్టం. అద్భుతమైన గురువు శ్రీశ్రీ రవిశంకర్ లభించడం అదృష్టం అని అన్నారు.
About Writer
డా|| యిమ్మడిశెట్టి వెంకటేశ్వర రావు
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
Kenisha: జయం రవి, గాయని కెనీషా మధ్య రిలేషన్‌షిప్‌ కట్