పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి
A film was made on Pratyusha 24 years ago
ప్రత్యూష కన్నతల్లి పట్టు వదలని వంటరి పోరాటాల ఫలితంగా 24 సంవత్సరాల తర్వాత నేడు సుప్రీంకోర్ట్ శిక్షలు విధించిన నిందితులను నిలదీస్తూ వర్ధమాన నటి ప్రత్యూష మరణంపై ఆనాడే డైరెక్ట్ గా ప్రత్యూష అనే పేరు పెట్టి సినిమా తీయడం సామాన్యమైన విషయం కాదు. దానికి గట్స్ ఉండాలి.ఎంతో గుండె ధైర్యం,తెగింపు కావాలి.
ప్రత్యూష మరణం వెనుక నాటి మంత్రుల కొడుకులు పోలీస్ అధికారుల కుమారులు,పెద్ద పెద్ద బడా బాబులు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల పిల్లలు ఉన్నారని తెలిసి కూడా అన్నింటికీ తెగించి కళామతల్లి నమ్మకంతో నూ నూగు మీసాల వయస్సులో ఉన్న సత్యారెడ్డి అనే ఒక యువ నిర్మాత ఒక ముందుకు వచ్చి అన్నపూర్ణ స్టూడియోలో నాటి ప్రముఖ యువ హీరో ప్రముఖ విలన్ అంకుశం రామిరెడ్డి, తెలంగాణ శకుంతల, కాస్టమ్స్ కృష్ణ, ఏవీఎస్, రమ్యశ్రీ ఐరన్ లెగ్ శాస్త్రి,కళ్ళు చిదంబరం,తిరుపతి ప్రకాష్తో పాటు భారీ తారగానం పెట్టి పెద్ద స్థాయిలో సినిమా ఓపెన్ చేయడం జరిగింది.
అప్పుడప్పుడే ప్రత్యూష మరణం తోటి ఉమ్మడి తెలుగు రాష్ట్రం తో పాటు భారతదేశమంతా సంచలమైన సంఘటన కావడంతో నాటి ప్రింట్ మీడియా, అప్పుడప్పుడే వస్తున్న ఎలక్ట్రానిక్ మీడియా, దూరదర్శన్లు ఈ సినిమా గురించి ఊహకందని ప్రచారం చేయటంతో ఒక్కసారిగా ఈ సినిమాకు హైప్ వచ్చింది. దీంతో ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్న వర్ధమాన హీరో భయపడి ఆమె మరణం వెనక చాలామంది పెద్దలు ఉన్నారు దయచేసి మీరు ఇచ్చిన అడ్వాన్స్ వెనక్కి తీసుకోండి భవిష్యత్తులో మీ సినిమాలో తక్కువ రెమ్యూనరేషన్ కి నటిస్తాను నన్ను క్షమించండి అని అడ్వాన్సుని వెనక్కి ఇవ్వడం జరిగింది.
హీరోతో పాటు రచయిత,గేయ రచయిత, గాయకులు కూడా భయపడి అడ్వాన్స్ లను వెనక్కిఇచ్చేసారు. దీంతో తప్పని పరిస్థితుల్లో నిర్మాతగా సినీ రంగంలో అడుగుపెట్టిన సత్యారెడ్డి హీరోగా రచయితగా, గేయ రచయితగా,సింగర్ గా మారి చిత్రాన్ని పూర్తి చేసి సెన్సార్ వారి తో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని 1100 అడుగుల నిడివి సెన్సార్ లో తీసివేయగా తెలంగాణ విడిపోక తలకే సత్యారెడ్డి వ్రాసిన తెలంగాణ ముద్దుబిడ్డ వే తెలుగు సినిమా కలువ పువ్వువే రాబందుల చేతబడితివా ఓ ప్రత్యూషమ్మ నువ్వు అంతలోనే రాలిపోతివా ఎందుకమ్మ ఆధాత ఇలా రాసే నీ రాత అనే సూపర్ హిట్ పాటతో పాటు, గవర్నర్ బంగ్లా ముందు జరిగే ధర్నా కార్యక్రమాలు లాంటి కొన్ని సన్నివేశాలు మరలా రీ షూట్ చేసి రీ సెన్సార్ చేయించి చిత్రాన్ని విజయవంతంగా విడుదల చేయడం జరిగింది. ఇందులో గొప్ప విషయం ఏమిటంటే చిత్రాన్ని చూసిన నేటి వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ కృష్ణ గుంటూరు జిల్లాలు వైజయంతి ద్వారా రిలీజ్ చేయటమే చిత్రం విజయం సాధించింది అని చెప్పొచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినకథ కావటంతో ధైర్యంగా చిత్రాన్ని నిర్మించి నందుకు విజయవాడ అన్నపూర్ణ థియేటర్లో హీరో సత్యారెడ్డి 50 అడుగుల కటౌట్ పెట్టి ఆయన అభిమానులు సత్యారెడ్డికి భారీ సన్మానం చేసి "జనంస్టార్" అని బిరుదు ఇవ్వటం కూడ జరిగింది.
ఆరోజు విజయవాడలో జరిగిన సన్మాన కార్యక్రమం జనం స్టార్ బిరుదు ప్రధానంలో అనేకమంది ప్రజా సంఘాల వారు, రచయితలు కూడా భారీ సంఖ్య లో పాల్గొనడం ఒక సంచలనమైంది. అలా ప్రజా సమస్యల పై జనంకోసం సామాజిక అంశాలతో సినిమాలను నిర్మించడం ప్రారంభించి జనం స్టార్ ఐన సత్యారెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విప్లవ కవి, ప్రజాయుద్ధనౌక గద్దరన్నతో "ఉక్కు సత్యాగ్రహం"అనే శత దినోత్సవ విప్లవ చిత్రాన్ని నిర్మించి ఇప్పుడు హాలీవుడ్ లో "కింగ్ బుద్ధ" అనే అమెరికాలో ప్రారంభమైన ఇంటర్నేషనల్ సినిమాకి దర్శకత్వం వహించే స్థాయికి వెళ్ళాడు. దీనిని బట్టి సామాజిక అంశాలను ప్రజా సమస్యలను ప్రతిబింబించే సినిమాలను ప్రజలు ఆదరిస్తారని చరిత్ర రుజువు చేస్తుందిఅని చెప్పొచ్చు.
అంతేకాక 25 దేశాల్లో షూటింగ్ జరుపుకొని 100 భాషలకు పైగా సత్యారెడ్డి దర్శకత్వంలో నిర్మించే కింగ్ బుద్ధ హాలీవుడ్ చిత్రం ప్రపంచ చరిత్రలో సంచలనం సృష్టించటంలో సందేహమే లేదని ఆయన అభిమానులు గంటపదంగా చెబుతున్నారు. అంతేకాదు 24 సంవత్సరాల తర్వాత ప్రత్యూష కేసులోని నిందితులకు శిక్ష పడటంతో దర్శక,నిర్మాత ఈరోజు జనం స్టార్ సత్యారెడ్డి తోపాటు నాటి పవన్ మనీ క్రియేషన్స్ చిత్ర యూనిట్ సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు