శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : మంగళవారం, 9 ఫిబ్రవరి 2021 (13:15 IST)

ఇతర భాషల్లోనూ ఆహా అనిపించుకోవాలి: అల్లు అరవింద్

OTT Aha, One year celeations
తెలుగు డిజిటల్ తెరపై ఏడాది పూర్తి చేసుకున్న తొలి తెలుగు ఓటీటీ..ఆహా
ఓటీటీ రంగానికి సరికొత్త అర్థం చెబుతూ మొదటిసారి ప్రాంతీయ భాషకు పెద్ద పీఠ వేస్తూ వ‌చ్చింది. అప్పటి వరకు కేవలం సినిమాలు, వెబ్ సిరీస్‌లకే పరిమితమైన ఓటీటీ రంగంలోకి
ఇంటర్వ్యూలతో పాటు పలు సరికొత్త కార్యక్రమాలతో దూసుకొచ్చింది ‘ఆహా’ ఓటీటీ.

తెలుగు డిజిట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తోన్న ఈ ఓటీటీకి సోమ‌వారం ఫిబ్ర‌వరి 8న‌ ఏడాది పూర్తయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆహా యాజమాన్యం సోమవారం రాత్రి తొలి ఏడాది వేడుక నిర్వహించింది. హైదరాబాద్‌లో జరిగిన ఆహా 1 కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, దర్శకుడు వంశీ పైడిపల్లి, రామ్, నటులు ప్రియదర్శిని, సుహస్ లతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

ఏడాది పూర్తి చేసుకుంటున్న తొలి తెలుగు ఓటీటీ ‘ఆహా’ ఇంత తక్కువ సమయంలోనే.. 2 కోట్లకుపైగా డిజిటల్ ప్రేక్షకులను ఆకర్షించడం విశేషం. ఈ ఏడాది కాలంలో ‘ఆహా’లో ఏకంగా.. 1.25 బిలియన్ నిమిషాల కంటెంట్‌ జనరేట్ చేయడం మరో విశేషం. ‘ఆహా’ ఈ స్థాయిలో విజయవంతం కావడానికి కారణమైన ప్రేక్షకులకు యాజమాన్యం ధన్యవాదాలు తెలిపింది.
 
ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ...ఆహా మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది, ఈ సందర్భంగా ఆహా నీ ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలుగు కంటెంట్‌తో ఉన్న ఏకైక ఓటితి ఆహా... కేవలం తెలుగు ప్రేక్షకులే కాదు తమిళ్, కన్నడ ప్రేక్షకులు కూడా అహను చూస్తూ ఆహా లో సబ్స్క్రైబ్ అయ్యారు.. ఇతర భాషలు కూడా పెట్టండి అంటూ అడుగుతున్నారు. ఈ ఏడాది వేడుకను ఇంకా గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈ ఆహా టీమ్ కు కూడా నా అభినందనలు అన్నారు.