Ken Karunas, Anishma Anil Kumar, Devadarshini Chetan and others
కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ మూవీ "యూత్". ఈ చిత్రాన్ని ఇదే పేరుతో ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు. ఈ నెల 26న "యూత్" మూవీ తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
'కమ్ విత్ యువర్ గ్యాంగ్, నోట్ - నో ఏజ్ లిమిట్' అనే స్లోగన్ తో ఈ సినిమా ప్రమోషనల్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సోమవారం ఈ సినిమా ప్రెషర్స్ మీట్ కార్యక్రమం పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో హైదరాబాద్ లో సందడిగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో హీరో, డైరెక్టర్ కెన్ కరునాస్ మాట్లాడుతూ, ఈ సినిమా చేస్తున్నప్పుడు ఆడియెన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు, బిజినెస్ జరుగుతుందా లేదా అనే కొన్ని భయాలు, సందేహాలు మాలో ఉండేవి. ఆ టైమ్ లో లిటిల్ హార్ట్స్ రిలీజై సక్సెస్ అయ్యింది. ఆ మూవీ మాలో కాన్ఫిడెన్స్ నింపింది. లిటిల్ హార్ట్స్ టీమ్ కు థ్యాంక్స్ చెబుతున్నాం. డీవోపీ సూర్య అన్న వల్లే తెలుగులో మా మూవీ రిలీజ్ అవుతోంది. సార్ సినిమాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాను. మమ్మల్ని నమ్మి యూత్ సినిమా తెలుగులో రిలీజ్ చేస్తున్న సందీప్, వినీత్ కు థ్యాంక్స్. ఈ నెల 26న యూత్ సినిమాను థియేటర్స్ లో చూడండి. మీ లైఫ్ లోని స్ట్రెస్ అంతా మర్చిపోతారు. మీ పేరెంట్స్ గురించి ఒక్కసారి మళ్లీ ఆలోచిస్తారు. మా సినిమాది ఎంటర్ టైన్ మెంట్ గోత్రం, యూత్ ను థియేటర్స్ కు తెప్పించే నక్షత్రం. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ - ఈ2సీ అంటే మేము రెగ్యులర్ గా చిల్ అయ్యే ప్లేస్, మా గూగుల్ మ్యాప్ లో లొకేషన్ అది. ఈ రోజు ఆ పేరు పోస్టర్ మీద ఉండటం చూస్తుంటే హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో ఒక పాట పాడాను. వినీత్, సందీప్ కు కంగ్రాంట్స్ చెబుతున్నా. అన్నారు.
డైరెక్టర్ సాయి మార్తండ్ మాట్లాడుతూ - "యూత్" సినిమాను మేమే తీసుకోవాలని అనుకున్నాం. కానీ ఇంతలో వినీత్, సందీప్ తీసుకున్నారు. కెన్ వర్సటైల్ పర్సన్. యాక్టింగ్, రైటింగ్, లిరిక్స్, సింగింగ్..ఇలా అన్నీ తానే టాప్ క్లాస్ లో చేస్తుంటాడు. నాకు మన మౌళిలా అనిపించాడు. ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది, పాటలు బాగున్నాయి. సింజిత్ సాంగ్ పాడాడు. ఈ మూవీలోని మీనాక్షిని మా లిటిల్ హార్ట్స్ లో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నాం. "యూత్" మూవీ చాలా బాగుంటుంది మీరంతా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. అన్నారు.
హీరో మౌళి తనూజ్ మాట్లాడుతూ - "యూత్" మూవీ టీజర్ చాలా బాగుంది. నేను సినిమా మొత్తం చూశాను. కంప్లీట్ ఎంటర్ టైనింగ్ మూవీ ఇది. మన తెలుగు ఆడియెన్స్ కు బాగా నచ్చుతుంది. మీ అందరినీ పక్కాగా ఎంటర్ టైన్ చేసే చిత్రమిది. మీరంతా తప్పకుండా ఈ నెల 26న యూత్ మూవీ థియేటర్స్ లో చూడండి. వినీత్, సందీప్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. అన్నారు.
హీరోయిన్ ప్రియాన్షి యాదవ్ మాట్లాడుతూ - "యూత్" మూవీతో తమిళంతో పాటు తెలుగు ఆడియెన్స్ కు పరిచయం కావడం సంతోషంగా ఉంది. మా సినిమాను థియేటర్స్ లో మీరంతా చూస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
హీరోయిన్ మీనాక్షి మాట్లాడుతూ - తెలుగు ఆడియెన్స్ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయడంలో ముందుంటారు. మా టీమ్ లో దాదాపు అందరం కొత్త వాళ్లమే. మా యంగ్ టీమ్ ను మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమాలో నేను ఫుడ్ లవర్ గా కనిపిస్తా. నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. మా మూవీని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. అన్నారు.
ప్రొడ్యూసర్ వినీత్ మాట్లాడుతూ - గ్లింప్స్ రిలీజ్ అయినప్పటి నుంచి "యూత్" మూవీ కంటెంట్ చాలా ఎగ్జైటింగ్ గా అనిపించింది. ఫస్ట్ డీవోపీ సూర్య ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పాడు. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ కు కనెక్ట్ అయ్యాక మేమంతా కాన్ఫిడెంట్ గా ముందుకెళ్లాం. కెన్ ఈ మూవీని ఎంతో ప్యాషన్ తో రూపొందించాడు. ఈ నెల 19 తమిళనాడు అంతా ఈ సినిమా చూసి సర్ ప్రైజ్ అవుతుంది. ఈ నెల 26న తెలుగులో ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటారు. అన్నారు.
ఇంకా పలువురు చిత్రటీమ్, అతిథులు మాట్లాడుతూ, చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.