Thiruveer: పాపం ప్రతాప్ కు ప్రశంసలే కాదు డబ్బులూ వస్తాయి : తిరువీర్
Thiruveer, Durga Naresh, Rakesh Reddy Gaddam and others
రేపటి నుంచి మీ ఇద్దరి మధ్య ఏ గొడవైనా జరిగినా.. ఆ గొడవ వల్ల నా పరువు పోయినా.. గుర్తుపెట్టుకో నీ బతుకు నా చేతిలో చేతబడి బొమ్మేరోయ్ అంటూ హీరో తండ్రి డైలాగ్‌తో ఆసక్తికరంగా టీజర్ ఉంది. థియేటర్లలో ఫన్ రైడ్ చేయించే ఈ నవ్వుల బ్లాక్ బస్టర్‌ను ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా హీరో తిరువీర్ మాట్లాడుతూ...నాకు చిన్నప్పుడు సినిమాల గురించి తెలిసింది ఈటీవీ ద్వారానే. ఈరోజు ఈటీవీ విన్‌తో సినిమా చేశా. గతంలోనే వీరాంజనేయులు విహారయాత్ర సినిమా నేను చేయాల్సింది. కానీ అప్పట్లో థియేటర్ సినిమాలే చేయాలని నాకు ఉండింది. ఈ రోజు నా లైనప్ చూస్తే నా నెక్ట్స్ సినిమా ఈటీవీ విన్ నుంచి వస్తోంది. ధైర్యంగా ఉండొచ్చు అనిపిస్తోంది. చాలా షార్ట్ పిరియడ్‌లో ఈటీవీ విన్ మంచి పేరు తెచ్చుకుంది. నరేష్ ఈ కథ పట్టుకుని చాలా తిరిగాడు. అతని కోసమే ఈ సినిమా చేయాలనిపించింది. నరేష్ ఏం చెప్పాడే అది విని ఈ సినిమా చేసుకుంటూ వెళ్లా. నా సినిమాలకు ప్రశంసలు మాత్రమే కాదు.. డబ్బులు కూడా వస్తాయని ఈ సినిమా నిరూపిస్తుంది. ఏప్రిల్ 17న మీకు టీజర్‌ను మించిన ఫన్ ఇస్తుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు నాకు మా నాన్న గుర్తొచ్చారు. ఈ సినిమా ఫ్యామిలీ అంతా కలిసి కూర్చుని చూసే సినిమా. థియేటర్లలో కలుద్దాం అని చెప్పారు.
మూవీ డైరెక్టర్ దుర్గ నరేష్ మాట్లాడుతూ, నా జర్నీ 2013లో మొదలైంది. అప్పటి నుంచి యుద్ధం చేస్తూనే ఉన్నా. నేను ఇక్కడ ఇన్వెస్ట్ చేసింది ఏజ్ మాత్రమే. నా లైఫ్ దీని మీద పెట్టేశాను. నాకు ఎక్కడ ఇబ్బంది కలిగినా సినిమా ఆపుకుంటూనే వచ్చా. సినిమా ఫెయిల్యూర్ అవుతుందనే చోట నేను చేయలేదు. ఎలాగైనా హిట్ కొట్టాలనే టార్గెట్‌తోనే నిలబడి ఉన్నా. ఈ రోజు గ్యారెంటీ ఇస్తున్నా.. పాపం ప్రతాప్.. మామూలు సినిమా అవదు. రాసి పెట్టుకోండి.. కావాలంటే బాండ్ పేపర్ మీద రాసిస్తా. నిర్మాతలు ఫ్రీడం ఇవ్వడం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది అని చెప్పారు.
నిర్మాత రుద్రదేవ్ మాదిరెడ్డి మాట్లాడుతూ, గడ్డం రాకేష్ రెడ్డి లాంటి పార్ట్‌నర్ ఉంటే సినిమా ఈజీగా చేయొచ్చు. ఇండస్ట్రీలో నేను ఎవరికీ తెలీదు. ఆయనే మొత్తం నడిపించారు. తిరువీర్ అమేజింగ్ ఆర్టిస్ట్. ఈటీవీ విన్ నుంచి సాయిగారు బాగా సపోర్ట్ చేశారు.క్రియేటివ్ ప్రొడ్యూసర్ కిషోర్ వల్లే ఇంత మంచి అవుట్‌పుట్ వచ్చింది. సినిమాను అందరూ చూసి ఆదరించండి అని కోరారు.
