1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. pavala syamala telugu actress suicide attempt thwarted by police

సినీ నటిని ఆత్మహత్యాయత్నానికి దారితీసిన ఆర్థిక కష్టాలు..

pavala shyamala
తెలుగు చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న నటి పావలా శ్యామల ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సినిమా అవకాశాలు లేకపోవడం, ఆర్థిక కష్టాలు చుట్టుముట్టడంతో ఆమె చావే శరణమని భావించింది. దీంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే, పోలీసులు సకాలంలో స్పందించి ఆమెను కాపాడి ఓ స్వచ్ఛంధ సంస్థలో చేర్పించారు. 
 
గత కొంతకాలంగా పావలా శ్యామలతో పాటు ఆమె కుమార్తె కూడా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీనికితోడు సినిమా అవకాశాలు లేకపోవడతో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో వారిని కొందరు ఓ హోమ్‌లో చేర్పించగా, అక్కడ ఆరోగ్యం మరింతగా క్షీణించడంతో మంచానికే పరిమితమయ్యారు. దీంతో తాము సరైన సేవలు అందించలేమంటూ హోమ్ నిర్వాహకులు చేతులెత్తేసి హోమ్ నుంచి బయటకు పంపేశారు. 
 
దీంతో దిక్కుతోచని స్థితిలో రోడ్డుపైకి చేరిన పావలా శ్యామల ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో వారిని కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించి తిరుమలగిరి ఏసీపీ రమేశ్ దృష్టికి తీసుకెళ్ళారు. ఆయన తక్షణమే స్పందించి కార్ఖానాలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్‌కు తరలించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రామకృష్ణ వారికి ఆశ్రయం కల్పించి అవసరమైన అన్ని సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. 
తర్వాతి కథనం
Akhanda 2 date: బాలక్రిష్ణ అఖండ 2 రిలీజ్ డేట్ ను ప్రకటించిన నిర్మాతలు - డిసెంబర్ 12న రిలీజ్