Pawan Kalyan: పవన్, హరీష్ శంకర్... ఉస్తాద్ భగత్ సింగ్ తాజా అప్ డేట్
Pawan Kalyan, Harish Shankar
గబ్బర్ సింగ్. తర్వాత మంచి నమ్మకంతో ఉస్తాద్ భగత్ సింగ్ తో పవన్ అభిమానులు ఉన్నారు. దేవిశ్రీప్రసాద్ సంగతం హిట్ ఫార్ములా. ఈ పాత భారీ స్థాయిలో ఉంటుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం వీరి కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
రాశీ ఖన్నా, శ్రీలీల హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్, గ్లింప్స్ మెగాభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పవన్ కల్యాణ్ హుషారైన స్టెప్పులు వేయనున్నట్లు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.
హైదరాబాద్ లో గత వారంలో ;పవన్ ఓ యాక్షన్ సీన్ లో పాల్గొనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోన్న ఈ సినిమాకు సంబంధించి మెగాభిమానులు కోరుకున్నట్లుగానే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ రానుంది. తాజాగా ఇదే విషయంపై మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ పెట్టింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రాశిఖన్నా అలాగే శ్రీలీల హీరోయిన్స్ గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. మంచి అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా రిలీజ్ కోసమే ఓ రేంజ్ లో టాలీవుడ్ వర్గాల్లో రచ్చ నడుస్తోంది. ఈ సినిమాని మొదట మేకర్స్ ఏప్రిల్ లో ప్లాన్ చేస్తున్నట్టు స్వయంగా తెలిపారు. మార్చ్ 19 లేదా 26 డేట్స్ లో ఉస్తాద్ వస్తాడు అంటూ పలు రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. కానీ ఇందులో ఏది నిజమైన కూడా భారీ క్లాష్ ఉంటుంది అని చెప్పాలి. 19 అయితే టాక్సిక్ ఉంటుంది. 26 అయితే ది ప్యారడైజ్ ఇంకా పెద్ది లు ఉన్నాయి. సో వీటిలో ఏ డేట్ లో సినిమా వస్తుందో వేచి చూడాలి.