శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Modified: గురువారం, 11 ఆగస్టు 2016 (17:08 IST)

అది తనను మార్చేసిందట... అందుకే పవన్‌ కళ్యాణ్ అన్నంత పనీ చేశాడు...?

ఇంతవరకూ సాహిత్యంలో ప్రముఖులు శేషేంద్ర కావ్య వాక్యాలు పేర్కొంటూ వస్తున్నారు. కానీ ఈమధ్య చలనచిత్ర ప్రముఖులు కూడా చాలామంది శేషేంద్ర కవితల్ని జెండాలుగా ఎగరేస్తున్నారు. వీరికి లీడర్‌ తెలుగు సినిమా 'గబ్బర్‌ సింగ్‌'. మొన్న ఈమధ్య ఒక దిన పత్రికకిచ్చిన ఇంటర్వ్

ఇంతవరకూ సాహిత్యంలో ప్రముఖులు శేషేంద్ర కావ్య వాక్యాలు పేర్కొంటూ వస్తున్నారు. కానీ ఈమధ్య చలనచిత్ర ప్రముఖులు కూడా చాలామంది శేషేంద్ర కవితల్ని జెండాలుగా ఎగరేస్తున్నారు. వీరికి లీడర్‌ తెలుగు సినిమా 'గబ్బర్‌ సింగ్‌'. మొన్న ఈమధ్య ఒక దిన పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో సూటిగా 'ఆధునిక మహాభారతం' గురించి ప్రస్తావించాడు పవన్‌ కళ్యాణ్‌. ఎంతో కాలంగా పునర్ముద్రణ కోసం ఎదురుచూస్తున్న ఈ కావ్యేతిహాసాన్ని కవి కుమారుడు సాత్యకి మహా కవి శేషేంద్ర 9వ వర్ధంతి కానుకగా తెలుగు సాహితీ ప్రజానీకానికి బహూకరిస్తున్నారు. 
 
మే నెలలోనే ఆయన 9వ వర్థంతి జరిగిన సందర్భంగా పుస్తకాన్ని విడుదల చేశారు. అయితే ఇంకా కాపీలు కావాల్సి రావడంతో పునర్‌ముద్రణ చేస్తున్నారు. అది కూడా పవన్‌ కళ్యాణే చేయడం విశేషం. తనకు ఎందుకు నచ్చిందో అన్న విషయాన్ని శ్రేయోభిలాషి దర్శకుడు త్రివిక్రమ్‌తో వివరించారు. తనను బాగా కదిలించిన ఈ పుస్తకాన్ని ప్రజలకు మరింత చేరువగా వుండాలని కోరుకుంటున్నట్లు చెబుతున్నారు. దాదాపు 25 వేల కాపీలను పవన్‌ అచ్చు వేయిస్తున్నాడు. గుంటూరు శేషేంద్ర కవితలు రచనలు పవన్‌ను చాలా మార్చేశాయంట.
 
ఆధునిక మహాభారతం 1970- 1986 మధ్యకాలంలో ప్రచురించిన శేషేంద్ర వచన కవితా సంకలనాల సమాహారం. 1984లో అప్పటివరకు వెలువడ్డ కవితా సంకలనాలను పర్వాలుగా రూపొందించారు. ఆంధ్రప్రభ వారపత్రికలో ఈ వివరణతో సహా ఆధునిక మహాభారతం ధారావాహికంగా వెలువడింది. 1984-86 వరకు ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో శేషేంద్ర జాలం శీర్షికన చిన్న కవితలు వెలువడ్డాయి. వీటికి అరుస్తున్న ఆద్మీగా పేరుపెట్టారు. ఆధునిక మహాభారతంలో ఆద్మీ పర్వంగా చేర్చారు. 
 
శేషేంద్ర ఆధునిక మహాభారతం వ్యాస విరచిత భారతానికి ఏ సంబంధం లేదు. శేషేంద్ర మాటల్లోనే ఆధునిక మహాభారతం అంటే నేటి మన భారతదేశం. ఫలితంగా శేష జ్యోత్స్న, జ్యోత్స్నపర్వంగా, నా దేశం నా ప్రజలు ప్రజా పర్వంగా, మండే సూర్యుడు సూర్యపర్వంగా, గొరిల్లా పశు పర్వంగా, నీరై పారిపోయింది ప్రవాహపర్వంగా, సముద్రం నా పేరు సముద్ర పర్వంగా, ఇందులో రూపొందాయి.