సోమవారం, 9 మార్చి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 మార్చి 2026 (16:50 IST)

'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ కాదు : దర్శకుడు హరీశ్ శంకర్

Harish Shankar, Ustad Bhagat singh
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' రీమేక్ మూవీ అంటూ జరుగుతున్న ప్రచారంపై ఆ చిత్ర దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. ఈ సినిమా తమిళ బ్లాక్ బస్టర్ "తెరి"కి రీమేక్‌ కాదని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, 'గబ్బర్ సింగ్‌'లో నేను పెట్టిన అంత్యాక్షరి ఎపిసోడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని 'తెరి'లో రౌడీలతో రైమ్స్ చెప్పించారు. నా సినిమాలోని సీన్‌‍ను వాళ్లు వాడుకుంటే ఇపుడు ఆ సినిమానే నేను రీమేక్ చేస్తున్నానని ప్రచారం చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఏ పోలీస్ కథలో అయినా హీరో సంఘ విద్రోహ శక్తులపై పోరాడుతారని, 'తెరి', 'టెంపర్' వంటి సినిమాల్నీ ఆ కోవకే చెందుతాయని వెల్లడించారు. 
 
కాగా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఇండస్ట్రీ హిట్ మూవీగా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత ఈ కాంబోలో వస్తున్న 'ఉస్తాద్ భవగ్ సింగ్'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించారు. శ్రీలీల, రాశీఖన్నా హీరోయిన్లు. ఇప్పటికే విడుదలైన చిత్ర గ్లింప్స్, పాటలకు అద్భుతమైన స్పందన వచ్చింది.