1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Pawan Kalyan's Wife Anna Lezhneva clarify rare post stuns fans

ఆ ఫోటోలో ఉన్నది నేను కాదు.. : పాత ఫోటోపై క్లారిటీ ఇచ్చిన పవన్ సతీమణి

pawan - marks
సోషల్ మీడియాలో కొన్నేళ్ళుగా చక్కర్లు కొడుతున్న ఓ ఫోటోపై పవర్ స్టార్ పపన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా క్లారిటీ ఇచ్చారు. అపుడెపుడో ఓ ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ పక్కన కూర్చొనివున్న మహిళను తాను కాదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాఖాతాలో ఓ పోస్టును షేర్ చేశారు. 
 
'ఈ అందమైన మహిళ నేను కాదు' అని పేర్కొన్నారు. 'ఈ పొరపాటును మొదట ఎవరు చేశారో నాకు తెలియదు. ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు డానా మార్క్స్. నా జీవితంలో నేను ఎప్పుడూ మోడల్‌గా కానీ, నటిగా కానీ పనిచేయలేదు' అని ఆమె వివరించారు. ఈ పోస్టుతో ఇంటర్నెట్‌లో చాలాకాలంగా ఉన్న ఓ అయోమయానికి తెరపడింది. 
 
వాస్తవానికి ఈ వైరల్ ఫొటో 2011లో వచ్చిన 'తీన్‌మార్' సినిమా ఆడియో విడుదల వేడుక నాటిది. అందులో పవన్ కల్యాణ్ పక్కన ఉన్నది ఆ చిత్రంలో 'మిచెల్' అనే చిన్న పాత్ర పోషించిన అమెరికన్ నటి డానా మార్క్స్. ఆమె "బార్బీ బొమ్మకి" పాటలో కూడా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. డానా మార్క్స్ అమెరికాకు చెందిన ప్రముఖ థియేటర్ ఆర్టిస్ట్, సింగర్. ప్రస్తుతం ఆమె అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీలో నటనలో శిక్షణ ఇస్తూ తన వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇద్దరూ విదేశీయులు కావడంతో చాలామంది డానా మార్క్స్‌ను అన్నా లెజినోవాగా పొరబడ్డారు.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పర్యాటకులకు ఇబ్బందిగా మారిన పాపికొండల పడవ ప్రయాణం.. ఎందుకు?