1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Pawan Kalyan takes a break from signing new films, OG 2 plans revealed

కొత్త చిత్రాలకు కమిట్ కాలేదు.. 'ఓజీ-2'పై త్వరలో అప్‌డేట్

pawan kalyan
ఇటీవల 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో రెండు చిత్రాలకు కమిట్ అయినట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీటికి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఏ కొత్త సినిమాకు కమిట్ అవ్వలేదని, ఇప్పట్లో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేసింది. 
 
'ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు ఏ కొత్త సినిమాకు కమటిమెంట్లు తీసుకోలేదు. ఆయన కొత్త ప్రాజెక్టులపై వస్తున్న ఊహాగానాలు వాస్తవం కాదు. సరైన సమయంలో ఏ విషయమైనా అధికారికంగా వెల్లడిస్తాం' అని ఓ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ఇక 'ఓజీ' చిత్రానికి సీక్వెల్‌గా భావిస్తున్న 'ఓజీ రెండో భాగం' అప్‌డేట్‌ను స్వయంగా పవన్ కళ్యాణ్ సరైన సమయంలో తెలియజేస్తారు అని స్పష్టం చేశారు. 
 
ఏపీ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా పవన్ సినిమాలు చేస్తున్న విషయం తెల్సిందే. 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తర్వాత మోహన్ రాజా, దేవ కట్టా వంటి దర్శకులతో చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి. 
 
ఈ నేపథ్యంలో వదంతులకు ఫుల్‌స్టాఫ్ పెట్టేందుకు పవన్ టీమ్ ఈ ప్రకటన విడుదల చేసినట్టు తెలుస్తోంది. ఈ తాజా ప్రకటనతో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో గతంలో ప్రకటించిన సినిమా భవిష్యత్ కూడా ప్రస్తుతానికి స్పష్టత లేనట్లయింది. ఇపుడు పవన్ తన దృష్టినంతా రాజకీయ బాధ్యతలపైనే కేంద్రీకరించినట్టు తెలుస్తోంది. 
తర్వాతి కథనం
2016లో విడాకులు తీసుకున్నారు... 2026లో మళ్లీ ఒక్కటైన సినీ సెలెబ్రిటీలు