సంబంధిత వార్తలు
- Allu Aravind : అల్లు రామలింగయ్య పేరిట గది నిర్మాణానికి అల్లు అరవింద్ విరాళం
- ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు : టైటిల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు
- ఐపీఎల్ 2026 ఫైనల్ పోరు : గుజరాత్ ముంగిట 156 రన్స్ టార్గెట్
- 01-06-2026 నుంచి 30-06-2026 వరకు మాస ఫలితాలు...
- ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ : టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆర్సీబీ
Charan: జీవితాంతం దాచుకునే సినిమాల్లో పెద్ది ఒకటి : రామ్ చరణ్
Divyendu, Ram Charan, Rathnavelu, A.R. Rahman, Buchi Babu Sana
మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు.
చరణ్ మాట్లాడుతూ, శివన్న గారిని స్క్రీన్‌పై చూస్తే ఓ ఫైర్‌లా అనిపిస్తుంది. జైలర్‌లో ఆయన సీన్స్ చూస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఒక ఐకానిక్ పెర్ఫార్మెన్స్. ఆయన కళ్లే ఎన్నో ఎమోషన్స్ మాట్లాడతాయి. రత్నవేలు గారితో నేను నాలుగు సినిమాలు చేశాను. ఆయన ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాకు ఆయన బిగ్గెస్ట్ అసెట్. దివ్యేందు రియల్ లైఫ్‌లో కూడా గ్యాంగ్‌స్టర్‌లా యాక్ట్ చేస్తుంటారు. దివ్యేందు, నేను ఒకే ఎత్తు ఉన్నా, సినిమాలో మా బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ మాత్రం ఆరున్నర అడుగుల పైనే ఉంటాయి. జాన్వీ గారు ఈ సినిమాకు ఎంతో అందాన్ని తీసుకొచ్చారు.
మా నిర్మాత సతీష్ కిలారు కి ధన్యవాదాలు. ఇది కష్టంతో చేసిన సినిమా కాదు, ఇష్టంతో చేసిన సినిమా. మగధీర, రంగస్థలం, ఆర్ఆర్ఆర్ చిత్రాలు చేస్తున్నప్పుడే అవి పెద్ద విజయాలు సాధిస్తాయని అనిపించింది. పెద్ది విషయంలో కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఇది చాలా స్ఫూర్తినిచ్చే సినిమా. నా కెరీర్‌లో జీవితాంతం దాచుకునే సినిమాల్లో ఇది ఒకటి. బుచ్చిబాబుకి, సుకుమార్ గారికి థాంక్యూ సో మచ్. పెద్ది సినిమా ఇండస్ట్రీ గర్వపడేలా చేస్తుంది. ఇదొక బ్యూటీఫుల్ ఎంటర్‌టైనర్. ఇందులో ఒక మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ సందర్భంగా సీఎం విజయ్ గారికి, తమిళనాడు ప్రజలకు నా శుభాకాంక్షలు తెలిజేస్తున్నాను. విజయ్ గారిని చూసి సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తిగా నేను ఎంతో గర్వపడుతున్నాను. పెద్ది చిత్రాన్ని ప్రతి ఒక్కరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.
శివరాజ్ కుమార్ మాట్లాడుతూ, పెద్ది జర్నీ ప్రేక్షకులను కదిలిస్తుంది. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ కథను చాలా అద్భుతంగా రాశారు, తీశారు. రెహమాన్ గారు ఈ సినిమాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇంత మంచి టీమ్‌తో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. నిర్మాత సతీష్ గారు ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. రామ్ చరణ్ గారి పెర్ఫార్మెన్స్, ట్రాన్స్‌ఫర్మేషన్ అద్భుతంగా ఉంటాయి. జూన్ 4న ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. మీలాగే నేను కూడా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.
ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, రామ్ చరణ్ కొత్త ప్రమాణాలను నెలకొల్పి అందరికీ స్ఫూర్తిగా నిలిచారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. కీరవాణి గారు, దేవిశ్రీ ప్రసాద్ గారు, తమన్, మణిశర్మ గారు వంటి అద్భుతమైన సంగీత దర్శకులు ఉన్న పరిశ్రమలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా కథను బుచ్చిబాబు గారు చెప్పినప్పుడు నాకు చాలా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించింది. ఈ చిత్రానికి పని చేయడం ఎంతో ఎంజాయ్ చేశాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.
డైరెక్టర్ బుచ్చిబాబు సానా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. చెన్నై అంటే నాకు చాలా ఇష్టం. నా ఫేవరెట్ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటారు. ఇక్కడ అడుగుపెడితేనే సినిమా కనిపిస్తుంది. పెద్ది మంచి ఎమోషనల్ డ్రామా. ఇది మిమ్మల్ని కట్టిపడేస్తుంది. చరణ్ సార్ పెర్ఫార్మెన్స్ చూసిన తర్వాత మీరు అంత తేలికగా మర్చిపోలేరు. నన్ను నమ్మినందుకు రామ్ చరణ్ గారికి థాంక్యూ సో మచ్. రెహమాన్ గారి గురించి నేను ఒక పుస్తకమే రాయగలను. ఆయనంటే నాకు అంత ఇష్టం. ఆయనతో కలిసి పని చేస్తానని నేను కలలో కూడా ఊహించలేదు. అది దేవుడి దయ వల్లే జరిగింది. రత్నవేలు గారు ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో తీశారు. శివన్న గారు గురువు పాత్రలో అద్భుతంగా నటించారు. గురుశిష్యుల బంధం ఎలా ఉంటుందో ఈ సినిమాలో రామ్ చరణ్ గారు, శివన్న గారిని చూస్తే అర్థమవుతుంది. నిర్మాత సతీష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే రామ్ చరణ్ గారిని కూడా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను.
దివ్యేందు శర్మ మాట్లాడుతూ.. పెద్దితో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. ఒక నటుడిగా ఇది నాకు చాలా పెద్ద అవకాశం. బుచ్చిబాబు గారు అద్భుతమైన దర్శకుడు, గొప్ప మనిషి. ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయనకు థాంక్స్. రామ్ చరణ్ గారితో కలిసి నటించడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఆయన చూపించిన ప్రేమ, ఆదరణకు ఎప్పటికీ కృతజ్ఞుడిని. రెహమాన్ గారు ఒక లెజెండ్. ఆయన సంగీతం ఉన్న సినిమాలో నటించడం నాకు గౌరవంగా భావిస్తున్నాను. ఆయన నా ఫేవరెట్. నేను నటిస్తున్నప్పుడు ఎంతో నమ్మకాన్ని ఇచ్చారు. అందరికీ థాంక్యూ సో మచ్.
డీవోపీ రత్నవేలు మాట్లాడుతూ..పెద్ది నా కెరీర్‌లో ఒక మైలురాయి చిత్రంగా నిలుస్తుంది. బుచ్చిబాబు ఒక బ్రిలియంట్ డైరెక్టర్. నాపై ఎంతో నమ్మకం ఉంచిన రామ్ చరణ్ గారికి ధన్యవాదాలు. థియేటర్‌లో మీరు ఒక గొప్ప సినిమాను అనుభవిస్తారు. శివన్న గారు, దివ్యేందు, బోమన్ ఇరానీ గారు సహా అందరూ అద్భుతంగా నటించారు. రామ్ చరణ్ గారితో ఇది నా నాలుగో సినిమా.
