1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Peddi Lyricist Questions Buchi Babu Sana's Apology Amid Backlash Over Janhvi Kapoor's Role

సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌కు భయపడి క్షమాపణ చెప్పి ఉండాల్సిందికాదు : అనంత్ శ్రీరామ్

Jhanvi Kapoor
సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్‌కు భయపడి దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండాల్సింది కాదని ప్రముఖ సినీ గేయరచయిత అనంత్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన చిత్రం పెద్ది. బుచ్చిబాబు సాన దర్శకుడు. ఏఆర్. రెహ్మాన్ దర్శకుడు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్‌ హిట్‌గా నిలిచింది. అయితే, ఈ చిత్రంలో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పారు. దీనిపై సినీ గేయరచయిత అనంత శ్రీరామ్ తప్పుబట్టారు. 
 
ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానంపై వచ్చిన విమర్శలకు దర్శకుడు బుచ్చిబాబు సానా క్షమాపణ చెప్పి, కొన్ని సన్నివేశాలను తొలగించడం ఏమాత్రం సబబు కాదన్నారు. ఇది కళాకారుల స్వేచ్ఛకు సంబంధించిన అంశమని చెప్పారు. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పి ఉండాల్సింది కాదని తన అభిప్రాయాన్ని స్పష్టంగా వెల్లడించారు. 
 
'ఒక పాత్రను దర్శకుడు తన ఊహకు తగ్గట్లు సృష్టిస్తాడు. సోషల్ మీడియాలో వచ్చే కొన్ని కామెంట్లకు భయపడి సృజనాత్మకతను పరిమితం చేయకూడదు. దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు' అని అనంత శ్రీరామ్ అన్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే కథలో పాత్రల ప్రవర్తన సహజంగా, కాస్త పచ్చిగా ఉంటుందని, దానిని తప్పుగా అర్థం చేసుకోకూడదని ఆయన వాదించారు.
 
ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమా విజయంలో కీలక పాత్ర పోషించగా, రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే, దర్శకుడు ఒకవైపు ప్రేక్షకుల మనోభావాలను గౌరవిస్తూ సినిమాకు మార్పులు చేయగా, మరోవైపు అనంత శ్రీరామ్ వంటి వారు కళాత్మక స్వేచ్ఛను సమర్థించడం ఈ వివాదానికి కొత్త కోణాన్ని ఇచ్చింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Nag Ashwin: మహానటి తర్వాత ప్రేక్షకులు ఓన్ చేసుకున్న సినిమా సింగ్ గీతం: నాగ్ అశ్విన్