1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Peddi Update: Peddi Character Poster on Ram Charan's Birthday; Bookings Open.

Ram Charan: పెద్ది అప్ డేట్: రామ్ చరణ్ బర్త్ డే నాడు పెద్ది క్యారెక్టర్ పోస్టర్, బుకింగ్స్ ఓపెన్

Ram Charan, Buchi Babu Sana
Ram Charan, Buchi Babu Sana
మెగా పవర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోగా తెరకెక్కుతున్న భారీ బ‌డ్జెట్ సినిమా పెద్ది. ఈ సినిమా ఆఖ‌రి దశ పనుల్లో వేగంగా ముందుకు సాగుతోంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతుంది. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం, సినిమా షూటింగ్ ముగింపు దశలోకి చేరుకుని కీలక సన్నివేశాలు పూర్తవుతున్నాయి.
 
ఈ నేపథ్యంలో, ఏప్రిల్ మొదటి వారంలో ప్రత్యేకంగా రూపొందించిన భారీ సెట్లో ఒక స్పెషల్ సాంగ్ ను మృణాల్ ఠాకూర్ పై చిత్రీకరించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా వుండగా, మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేయనున్నట్లు దర్శకుడు బుజ్జిబాబు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టర్ ను విడుదల చేశారు. 
 
ఇప్పటికే ఏ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని రెండవ సింగిల్ 'రైరైరారా', మార్చి 2న విడుదలైనప్పటి నుండి ఐదు భాషల్లో కలిపి 7 కోట్ల వీక్షణలు దాటగా, తెలుగు వెర్షన్ 20 రోజుల్లోనే 5 కోట్ల వీక్షణలను సాధించింది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్‌తో పాటు జాన్వీ కపూర్ ఇతర నటీనటులు నటిస్తున్నారు. 
 
ఈ చిత్రం ఏప్రిల్ 30, 2026న విడుదల కానుంది. ఈ వేడుకల్లో భాగంగా మార్చి 24న క్యారెక్టర్ పోస్టర్ విడుదల చేయనున్నారు. అదే విధంగా మార్చి 26న హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఒక భారీ కార్యక్రమంతో పాటు చరణ్ పుట్టినరోజున అర్ధరాత్రి నుండి నార్త్ అమెరికా బుకింగ్‌లు ప్రారంభం కానున్నాయి.
తర్వాతి కథనం
Diya: డిజిటల్ యుగంలో అవకాశాల కోసం ఎదురు చూడాల్సిన అవసరం లేదు : రఘుకుంచె