సోమవారం, 9 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (14:49 IST)

Keeravani: పుడుతూనే సెలబ్రెటీలు అవ్వరు, సింగర్‌ గా సక్సెస్ కాలేకపోయా : ఎం.ఎం.కీరవాణి

Niharika Konidela,, M. M. Keeravani, Vamsi Thummala, Sandhya Vashisht, Anand Deverakonda,  Chinta Gopal Krishna Reddy
Niharika Konidela,, M. M. Keeravani, Vamsi Thummala, Sandhya Vashisht, Anand Deverakonda, Chinta Gopal Krishna Reddy
యంగ్‌ బ్లడ్‌ అంతా ఎంతో ఉత్సాహంతో చేసిన సినిమా శ్రీ చిదంబరం. ఈ సినిమా సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను అని సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి అన్నారు. వంశీ తుమ్మల, సంధ్యా వశిష్ట జంటగా నటించిన ఈ చిత్రం ద్వారా వినయ్ రత్నం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫిబ్రవరి 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు లెజెండరీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ, నిర్మాత, నటి నిహారిక కొణిదెల హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ఎమ్.ఎమ్‌. కీరవాణి మాట్లాడుతూ ' అందరూ పుడుతూనే సెలబ్రెటీలు అవ్వరు. ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఉంటాయి. నేను ఇండస్ట్రీలోకి ప్లేబ్యాక్‌ సింగర్‌ అవ్వాలని వచ్చాను. కానీ కొద్ది రోజులోనే అది కష్టమని తెలిసిపోయి సంగీత దర్శకుడిగా కొత్త ఉపాధి వెతుక్కున్నాను. అయితే ఇన్ని సంవత్సరాల తరువాత సంగీత దర్శకత్వం నా బ్రెడ్‌ అండ్‌ బటర్‌ అయితే సింగర్‌గా పాడటం అనేది నా హాబిగా మారిపోయింది.శ్రీ చిదంబరంలో నేను పాడిన పాటను నా చెల్లెలు రోజు సుప్రభాతంలా వింటుండేది. నేను దర్శకుడికి ఫోన్‌ చేయించి అభినందనలు చెప్పించాను. ఈ సినిమాలో పాట పాడినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమాతో అందరికి విజయం అందించాలని కోరుకుంటున్నాను' అన్నారు.
 
ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ '' తొలి సినిమా ఎంతో ఇంపార్టెంట్‌ నాకు తెలుసు. వాళ్ల కష్టం తెలుసు. అందుకే ఇక్కడికి వచ్చాను. మా సినిమా ఎడిట్‌లో ఉన్నప్పుడు ఆదిత్యహాసన్‌ నన్ను ఈ సినిమా ప్రీరిలీజ్‌కు వెళ్లమని చెప్పాడు. హీరో అంటే కేవలం హీరోయిజమే కాదు. జనాలకు నమ్మకం కూడా ఇవ్వాలి. ఈ సినిమా ఇంటెన్షన్‌ అదే. ఈ సినిమాలో హీరో పాత్రను చేయడం చాలా కష్టం. వంశీని  ఆ పాత్రలో చూస్తే ఎంతో కన్వీన్సింగ్‌గా అనిపించింది. ఈ సినిమాలో నటించిన అందరికి, పనిచేసిన సాంకేతిక నిపుణులందరికి అభినందనలు తెలిపారు.
 
నిహారిక కోణిదెల మాట్లాడుతూ '' నాకు దర్శకుడు వినయ్‌ మూడు సంవత్సరాల నుంచి తెలుసు. ఈ ఫంక్షన్‌కు వినయ్‌కు సపోర్ట్‌ చేయడానికి నేను వస్తానని చెప్పి మరీ వచ్చాను. వినయ్‌ అండ్‌ ఫ్రెండ్స్‌ ఎంతో ఎనర్జీతో ఈ సినిమా చేశారు. ఈ మొదటి సినిమా ఫిలీంగ్‌ వీళ్లందరికి లైఫ్‌లాంగ్‌ గుర్తుంటుంది. ఎంతో కాన్పిడెంట్‌ ఉన్న యంగ్‌ టీమ్‌ ఇది. ఇలాంటి టీమ్‌ను చూస్తే నాకు ఎంతో ముచ్చటేస్తుంది. వినయ్‌తో పాటు ఈ సినిమా టీమ్‌ అందరికి మంచి ఫ్యూచర్‌ ఉంటుంది. నిర్మాతగా ఉండే ఒత్తిడి నాకు తెలుసు. గోపాల కృష్టారెడ్డి, వంశీ నందిపాటిల నిర్మాతలు సినీ పరిశ్రమకు అవసరం. ఇలాంటి నిర్మాతలు గెలిస్తే మరెంతో మందికి అవకాశం ఇస్తారు.కీరవాణి లాంటి లెజెండ్‌    సంగీత దర్శకుడు ఈ సినిమాలో పాట పాడటం ఈ సినిమాకు ఎంతో గౌరవాన్ని తెచ్చింది. ఆయన ఇలాంటి యంగ్‌ టీమ్‌ను సపోర్ట్‌ చేయడం ఎంతో సంతోషంగా ఉంది' అన్నారు.