1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Pithapuramlo movie that beautifully portrays the bond between a father and daughter: Producers

తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా ఆవిష్కరించే చిత్రం పిఠాపురంలో : నిర్మాతలు

Producers Akula suresh patel, FM Murali, Dundigalla Balakrishna
Producers Akula suresh patel, FM Murali, Dundigalla Balakrishna
మా దర్శకుడు జన సేన అభిమాని పార్టీ కోసం పిఠాపురంలో ప్రచారం చేశారు. ఆయనది చేబ్రోలు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపిస్తే ఇదే ప్రాంతంలో షూటింగ్ చేస్తానని మాటిచ్చారు. అందుకే అక్కడే చిత్రీకరణ చేశాం. దాదాపు 75 శాతం షూటింగ్ అక్కడే చేశాం అని నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ అన్నారు.
 
సీనియర్ దర్శకులు మహేష్ చంద్ర దర్శకత్వంలో పిఠాపురంలో … అలా మొదలైంది’  మూవీ రూపుదిద్దుకుంది. డాక్టర్ రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్, విరాట్, సాయి ప్రణీత్, శ్రీలు, ప్రత్యూష, రెహానా ఇందులో ప్రధాన పాత్రలను పోషించారు. ఈ సినిమాని మే 1న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు దుండిగల్ల బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) సోమవారంనాడు చిత్ర విశేషాల్ని తెలియజేశారు.
 
నిర్మాత దుండిగల్ల బాలకృష్ణ మాట్లాడుతూ, హైదరాబాద్, గోవాల్లోనూ కొంత పార్ట్ షూట్ చేశాం. మహేష్ చంద్ర గారితో మాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఆకుల సురేష్ గారితో మహేష్ చంద్ర గారు ఓ సినిమా చేయాలని అనుకున్నారు. ఆ తరువాత మేం జాయిన్ అయ్యాం. భారీ తారాగణంతో కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేశారు. ఇది పూర్తిగా కుటుంబ కథా చిత్రం. ఇందులో రాజకీయ అంశాలేవీ ఉండవు. తండ్రీకూతుళ్ల బంధాన్ని అద్భుతంగా చూపించాం’ అని అన్నారు.
 
మరో నిర్మాత ఎఫ్. ఎం. మురళి (గోదావరి కిట్టయ్య) మాట్లాడుతూ, నేను జర్నలిస్ట్‌గా పిఠాపురంలో పని చేస్తుంటాను. సినిమాలో చూపించే అందమైన గ్రామీణ ఇల్లులానే మా ఇల్లు ఉంటుంది. దర్శకుడు మా ఇంటిని చూసి షూటింగ్‌కి కావాలని అడిగారు. ఒకసారి లీవ్ పెట్టుకుని మరీ షూటింగ్‌ను చూశాను. ఎంతో సహజంగా అనిపించింది. ఆ తరువాత నాకు కథలో భాగం అవ్వాలని అనిపించింది. కారెక్టర్ కాదు.. నేను నిర్మాతగా ఇందులో పార్ట్ అవ్వాలని అనుకున్నాను. మహేష్ గారి టేకింగ్ నాకు నచ్చి ఇందులోకి వచ్చాను. ‘ప్రేయసిరావే’ లాంటి గొప్ప మూవీని తీసిన మహేష్ గారితో వర్క్ చేయడం నా అదృష్టం’ అని అన్నారు.
 
ఇంకో నిర్మాత ఆకుల సురేష్ పటేల్ మాట్లాడుతూ, మహేష్ చంద్ర గారు తీసిన ‘ప్రేయసి రావే’ అంటే నాకు చాలా ఇష్టం. ఈ కథ ఆయనకు వినిపించాం. డైరెక్టర్ గారు రైటర్ శ్రీరామ్ ఈ కథ మీద బాగా వర్క్ చేసి అద్భుతం గా డైలాగ్ వర్షెన్, స్క్రిప్ట్ కంప్లీట్ చేశారు. కరోనా వల్ల ఈ చిత్రం ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రెసిడెంట్ పాత్రకు రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకున్నాం. ఆయన ఆ పాత్రకు వంద శాతం న్యాయం చేశారు. మంచి సినిమా తీశామని ఆడియెన్స్ చెబుతారు. ప్రీమియర్‌లో చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరు పెట్టుకుంటూ బయటకు వచ్చారు. మౌత్ టాక్‌తో మా సినిమా ముందుకు వెళ్తూనే ఉంటుంది’ అని అన్నారు.
About Writer
దేవీ
తర్వాతి కథనం
Kamakshi Bhaskarla: ఎం.ఎస్. రాజు అగధ లో ‘మహాదేవి గా కామాక్షి భాస్కర్ల