1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. PM Modi asked about Peddi, and youth in West Bengal turned up dressed in the Peddi getup: Ram Charan

PM Modi: ప్రధాని మోదీ పెద్ది గురించి అడిగారు, వెస్ట్ బెంగాల్‌లో యూత్ పెద్ది గెటప్‌తో వచ్చారు: రామ్ చరణ్

Ram Charan, janvi, satish, boman, buchibabu
Ram Charan, janvi, satish, boman, buchibabu
గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో పెద్ది చిత్రం రూపొందిందని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా 'పెద్ది' దేశవ్యాప్తంగా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం ఇప్పటికే అద్భుతమైన గ్లింప్స్, రెండు చార్ట్ బస్టర్ పాటలు, పవర్ ఫుల్ థియేట్రికల్ ట్రైలర్‌తో మెస్మరైజ్ చేస్తోంది.

బుచ్చి బాబు సానా దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పెద్ది జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. జూన్ 3న ప్రత్యేక ప్రీమియర్‌లు ప్రదర్శించనున్నారు. ఈ నేపధ్యంలో చిత్ర బృందం ఢిల్లీలో గ్రాండ్ ప్రెస్ మీట్ నిర్వహించింది.
 
ఢిల్లీ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ, దేవుడి దయ వల్లే గత రెండున్నర సంవత్సరాలుగా ఎంతో డెడికేషన్‌తో ఈ సినిమా చేశాం. ఇది చాలా గొప్ప ఎంటర్‌టైనర్. ప్రేక్షకులను ఇన్‌స్పైర్ చేసే సినిమా. ఈ సినిమాను పిల్లలతో కలిసి థియేటర్లలో చూడండి. వాళ్లు చాలా ఇన్‌స్పైర్ అవుతారు. ఇది మట్టి వాసన ఉన్న కథ. గతంలో నేను చేసిన రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలు సాధించాయి. భారతదేశంలోని అత్యుత్తమ ఆటగాళ్లు చాలామంది ట్రైబల్ ప్రాంతాల నుంచే వచ్చారు. 
 
నేను ఇటీవల ఢిల్లీలో ప్రధాని మోదీ గారిని కలిసినప్పుడు పెద్ది దేని గురించి అని అడిగారు. గ్రామాలకు సాధికారతను అందించే కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందని చెప్పాను. అప్పుడు ఆయన ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. వెస్ట్ బెంగాల్‌లో ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది యువకులు పైన జెర్సీ, కింద లంగోటా ధరించి కనిపించారని, వాళ్లు ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చామని చెప్పారు. దాదాపు 40 ఏళ్ల క్రితం ఆ గ్రామం నుంచి మొహమ్మద్ అనే వ్యక్తి భారత ఫుట్‌బాల్ జట్టుకు ఆడాడు. ఇప్పుడు అదే గ్రామం నుంచి 80 శాతం మంది ఫుట్‌బాల్ ఆడుతున్నారు. ఒక్క వ్యక్తి స్ఫూర్తి ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో అది చూపిస్తుంది. ‘పెద్ది’ కూడా అలాంటి ఒక కథ. 
 
ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన యువకుడు తన ఐడెంటిటీ కోసం ఎలా పోరాడాడనేది పెద్దిలో చూస్తారు. ఈ పాత్రకు ఏం కావాలో అంతా ప్రాణం పెట్టి చేశాను. జూన్ 4న సినిమా విడుదల అవుతోంది. అందరూ థియేటర్లలో చూసి సపోర్ట్ చేయాలి. ఇది లార్జ్ స్కేల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా. మీకు సినిమా నచ్చితే తప్పకుండా ప్రమోట్ చేయండి. అందరికీ థాంక్యూ.  
 
హీరోయిన్ జాన్వి కపూర్ మాట్లాడుతూ, నేను పూర్తిగా ఆయన విజన్‌ను ఫాలో అయ్యాను. రామ్ చరణ్ గారితో పనిచేయడం వండర్‌ఫుల్ ఎక్స్‌పీరియన్స్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన ఎనర్జీ అద్భుతంగా ఉంటుంది. ఇది చాలా రూటెడ్ ఫిల్మ్. ఇండియాలో, ఇండియన్స్ కోసం నిర్మించిన సినిమా. ఇలాంటి గొప్ప సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో హార్డ్‌వర్క్‌తో ఈ సినిమా చేశాం. తప్పకుండా జూన్ 4న ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంది.  
 
బోమన్ ఇరానీ మాట్లాడుతూ,  రామ్ చరణ్ డాన్స్, ఎనర్జీ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడానికి ఆయన ప్రాణం పెట్టి పనిచేస్తారు. మనందరం ఆయన స్ఫూర్తిని అభినందించాలి. డైరెక్టర్ బుచ్చిబాబు గారు చాలా పాషనేట్ ఫిల్మ్‌మేకర్. ఆయన కథ చెప్పినప్పుడే నాకు చాలా నచ్చింది. వెంటనే ఇలాంటి సినిమాలో భాగం కావాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమా చేస్తూ చాలా ఎంజాయ్ చేశాను. అద్భుతమైన లొకేషన్స్‌లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రంలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా మీకు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
 
దివ్యేందు శర్మ మాట్లాడుతూ, రామ్ చరణ్ గారితో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా, నా పాత్ర నా అంచనాలకు మించి అద్భుతంగా వచ్చింది. రత్నవేలు గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ఇందులో రామ్ చరణ్ గారి ‘పెద్ది’ పాత్ర, తన గుర్తింపు కోసం చేసే పోరాటం ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జూన్ 4న ఈ సినిమాను తప్పకుండా థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నాను.
 
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ,  ప్రతి ఒక్కరూ ఎంతో అంకితభావంతో పనిచేశారు. మాకు ఎంతగానో సహకరించారు. రామ్ చరణ్ గారికి, జాన్వి గారికి, మా డైరెక్టర్ బుచ్చిబాబు గారికి, అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఇది చాలా రూటెడ్ స్టోరీ. ఎమోషనల్, ఎంటర్‌టైనింగ్ అంశాలతో పాటు చాలా గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కించాం. అందరూ పిల్లలు, ఫ్యామిలీతో కలిసి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను.
About Writer
దేవీ
తర్వాతి కథనం
ప్రతి ఒక్కరికి కష్టాలు కామన్‌గా ఉంటాయి... కానీ : జగపతి బాబు