1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. police complaint movie director sanjeevi meloti sensational allegations on actress varalakshmi

లక్షలకు లక్షలు పారితోషికం తీసుకున్న వరలక్ష్మి ప్రమోషన్‌కు డుమ్మా కొట్టారు.. (Video)

sanjeevi meloti
ప్రముఖ నటి వరలక్ష్మిపై 'పోలీస్ కంప్లైట్' చిత్ర దర్శకుడు సంజీవ్ మేగోటి సంచలన ఆరోపణలు చేశారు. లక్షలకు లక్షలు పారితోషికం తీసుకున్న నటి వరలక్ష్మి ప్రమోషన్‌కు పిలిస్తే రావడం లేదు కదా సమయం లేదంటూ చెబుతున్నారన్నారు. పెద్ది సినిమాకు రామ్ చరణ్ వంటి స్టార్ హీరో రేయింబవుళ్లు ప్రమోషన్ చేశారని ఆయన గుర్తు చేశారు. 
 
అదేవిధంగా 94 యేళ్ల వయసులో కూడా "సింగ్ గీతం'' చిత్రానికి ఆ చిత్ర దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు ప్రమోషన్ చేసుకునేందుకు వీల్ చైర్‌లో మీడియా ముందుకు వచ్చారని అన్నారు. మరి వరలక్ష్మి సొంతంగా నిర్మించుకున్న చిత్రానికి మాత్రం ప్రమోషన్ చేసుకున్నారని గుర్తు చేశారు. సరస్వతి సినిమాను ప్రమోషన్ చేసుకోవడానికి టైమ్ ఉండగా, మా చిత్ర ప్రమోషన్ చేసేందుకు సమయం లేదా అని ప్రశ్నించారు. సొంత సినిమా అయితే ప్రమోషన్ చేసుకుంటారు, ఇతరుల సినిమా అయితే ప్రమోషన్లకు రారా అని దర్శకుడు సంజీవ్ మేగోటి ప్రశ్నించారు. 

 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
'మీరే నా సర్వస్వం..' - భారతీరాజా మృతిపై నటి రాధిక ఎమోషనల్ పోస్ట్