ఆదివారం, 19 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 10 మార్చి 2026 (18:52 IST)

Priyadarshi: ప్రియదర్శి, సాయి కుమార్ ల సుయోధన చిత్రం సిద్ధమైంది

Priyadarshi, Drishika Chander
Priyadarshi, Drishika Chander
ప్రియదర్శి, ద్రిషిక చందర్ హీరో హీరోయిన్ గా డైలాగ్ కింగ్ సాయికుమార్, సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలకపాత్రల్లో నటించిన చిత్రం సుయోధన. వై ఎస్ మాధవ్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 27 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ రిలీజ్ డేట్ పోస్టర్ ను విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ మంచి కదా కదానాలతో అత్యత్తమ ప్రమాణాలతో సుయోధన చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది. ప్రియదర్శి సాయికుమార్  ద్రిషిక చందర్ , సీనియర్ హీరోయిన్ ప్రేమ కీలక పాత్రలు పోషించారు. జై క్రిష్ సంగీత దర్శకత్వం వహించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ ను అందించారు . అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను మార్చి 27 న ప్రేక్షకులముందుకు తీసుకువస్తున్నాము. త్వరలో ఈ సినిమా టీజర్ ట్రైలర్ మరియు పాటలను రిలీజ్ చేస్తాము అన్నారు. 
 
శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా ఈ సినిమా రిలీజ్ అవుతోంది 
 
నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్ , సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు