1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Producer Naveen Yerneni Speech at Ustaad Bhagat Singh Movie tickets rates hike

'ఉస్తాద్ భగత్ సింగ్' సత్తా ఎంతో తెలుసుకుందామని రేట్లు పెంచలేదు : నిర్మాత నవీన్

Ustad Bhagat Singh poster
'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా సత్తా ఎంతో తెలుసుకుందామని సినిమా టిక్కెట్ రేట్లు పెంచలేదని ఆ చిత్రం నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అన్నారు. ఆయన దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శ్రీలీల, రాశీఖన్నాలు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 19వ తేదీన విడుదలకానుంది. నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు నిర్మాతలు. ఈ నేపథ్యంలో చిత్రం బృదం విలేకరుల సమావేశం నిర్వహించింది. 
 
ఇందులో దర్శకుడు నవీన్ యెర్నేని, రవిశంకర్‌లు మాట్లాడుతూ, ఆదిత్య ధర్‌ గొప్ప దర్శకుడు. ‘ధురంధర్‌’ రాక మునుపే ఆయన అభిమానిని. ఆ సినిమా జానర్‌ వేరు.. మనది వేరు. ఆ చిత్రానికి ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’కు కాంపిటీషన్‌ లేదు. ఈ సినిమాలో పవన్‌ నవ్వు దగ్గర నుంచి ఆయన స్వాగ్‌ వరకూ ప్రతిదీ అభిమానులను ఆకట్టుకుంటుంది. పవన్‌ను ఇలా స్క్రీన్‌పై చూసి చాలా రోజులైంది. ఈ మాటలు దర్శకుడిగా చెప్పడం లేదు. అభిమానిగా చెబుతున్నా. ఇది నేను ఫ్యాన్స్‌కు ఇచ్చే భరోసా.
 
మాకు పెద్దలతో చర్చించేంత సమయం లేదు. మామూలు టికెట్‌ రేట్లకు ఎంత వసూళ్లు అవుతాయో అన్నది చూద్దామని ఆ ప్రయత్నం చేయలేదు. ఇకపోతే. పవన్‌ ఈ సినిమా కోసం చాలా సపోర్ట్‌ చేశారు. మినిమం అడ్వాన్స్ తీసుకున్నారంతే. రాజకీయాల్లో బిజీగా ఉండడంతో 3 నెలలు మాత్రమే డేట్స్ ఇవ్వగలను అన్నారు. ఒక్కోసారి 15 గంటలు కూడా కష్టపడ్డారు. అందుకు తగినట్టుగా ఇతర సభ్యులు కూడా సహకరించారు అని వెల్లడించారు. 
తర్వాతి కథనం
Sreeleela: ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీమియర్ షోలు ప్రారంభమవుతాయి : నవీన్ యెర్నేని