Sprit: హైదరాబాద్ లో ప్రభాస్ చిత్రం స్పిరిట్ షూట్ కు కారణం చెప్పిన నిర్మాత
ప్రస్తుతం ప్రభాస్ మూడు సినిమాల్లో బిజీగా వున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న స్పిరిట్ సినిమా షూట్ అన్ని చోట్ల చేశాక తిరిగి హైదరాబాద్ చేరింది. మరో వైపు ఫౌజ్ సినిమా షూట్ కూడా కొద్దిరోజు హైదరాబాద్ శివార్లో, కోటి ఉమెన్స్ కాలేజీలో కూడా జరుగుతోంది. ఓ సందర్భంగా హైదరాబాద్‌లోనే ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా భారీ చిత్రం స్పిరిట్ షూటింగ్ ఎందుకు జరుపుతున్నారో నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా వెల్లడించారు
ముంబైతో పోలిస్తే హైదరాబాద్‌లో షూటింగ్ చేస్తే 20-30% ఖర్చు ఆదా అవుతుందనీ, రణబీర్ కపూర్ నటించిన యానిమల్ చిత్రాన్ని ముంబైలో నిర్మించిన అనుభవం నుండి రెండు నగరాల మధ్య నిర్మాణ వ్యయాలలో ఎంత తేడా ఉంటుందో తనకు తెలిసిందని ప్రణయ్ తెలిపారు.
ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అదే Animal సినిమాను హైదరాబాద్ నుండి నిర్మించి ఉంటే ఖర్చు 20 నుంచి 30 శాతం వరకు తగ్గి ఉండేదని ప్రణయ్ అంచనా వేశారు.
