ఆదివారం, 12 ఏప్రియల్ 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 13 మార్చి 2026 (19:41 IST)

M. Arjun Raju: ప్రముఖ నిర్మాత శ్రీ ఎం. అర్జున్ రాజు మ్రుతి

Producer M. Arjun Raju
Producer M. Arjun Raju
ప్రముఖ నిర్మాత రోజా ఆర్ట్స్ అధినేతల లో ఒకరైన యం అర్జున రాజుగారు  అనారోగ్యంతో  నేడు మరణించారు. వారు రోజా ఆర్ట్స్ బ్యానర్ పై  శివరామరాజు భాగస్వామ్యంతో కొండవీటి సింహం ,వేటగాడు వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించారు.రోజా ఆర్ట్ ప్రొడక్షన్స్ , రోజా ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ల మీద కూడా పలు చిత్రాలు నిర్మించారు.
 
అంత్యక్రియలు రేపు ఉదయం (14.03.2026) హైదరాబాద్, జూబ్లీ హిల్స్‌లోని మహాప్రస్థానం లో జరుగుతాయి. వారి హఠాత్తు మరణం చలన చిత్రపరిశ్రమ కు తీరని లోటు.వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి మరణం పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రకటిస్తున్నాం.వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు తగిన మనో ధైర్యాన్ని ప్రసాదించాలి అని ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్  కోరుకుంటోంది.
 
ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్, నిర్మాతలమండలి కూడా  ఎం. అర్జున్ రాజు నిర్మించిన చిత్రాలను గుర్తుచేస్తూ, నిబద్ధతతో కూడిన నిర్మాతగా పేర్కొొంది. వారి కుటుంబానికి సానుభూతి ప్రకటించింది. శోకసంద్రంలో మునిగిపోయిన వారి కుటుంబ సభ్యులకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది.