Rahul Sipligunj : బైక్ రైడర్ సీటులో దారిచూపిన వ్యక్తి అంటూ ఆనందక్షణాలతో రాహుల్ సిప్లిగంజ్
Rahul Sipligunj and Keeravani Happy movment
నా సంగీత ప్రయాణంలో నాకు దారి చూపిన వ్యక్తి... ఈ రోజు, నా కలల బైక్ రైడర్ సీటులో కూర్చున్నారు. జీవితం ఒక అందమైన వలయంలా తిరిగి వస్తుంది.. అంటూ ఆనందోకూడిన క్షణాలను సోషల్ మీడియాలో రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తం చేశారు. తెలంగాణ యాసతోపాటు ఓల్డ్ సిటీ స్టయిల్ లో పాటలు పాడే రాహుల్ కు ఒక్కసారిగా ఆర్.ఆర్.ఆర్. సినిమాతో ప్రపంచానికి తెలియజేశారు కీరవాణి. మరి అలాంటి క్షణాలు మరోసారి రాబోతున్నాయంటూ హింట్ ఇచ్చారు.
విశ్వసనీయ సమాచారం మేరకు మహేష్ బాబు నటిస్తున్న వారణాసిలో రాహుల్ పాట పాడేట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబోస్ కూడా చక్కటి భావయుక్తంగా రాసినట్లు సమాచారం. మరోవైపు కీరవాణి తన మ్యూజిక్ టీమ్ తో సోదరుడు, రాహుల్ తో కలిపి వున్న మరో ఫొటోను కూడా పోస్ట్ చేశారు. మ్యూజిక్ సిట్టింగ్ లో వున్నట్లు కనిపిస్తోంది.
ఇక రాహుల్ తెలంగాణ జానపద శైలి, హైదరాబాద్ యాస తో పెక్యులర్ వాయిస్ గా అలరించాడు. గల్లీ కా గణేశ్ వంటి ఆల్బమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టి జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడా పాటతో సినీ గాయకుడిగా అడుగులువేశారు. రంగస్థలం టైటిల్ సాంగ్‌తో అతని దశ తిరిగింది. మరోవైపు రాబోయే వినాయకచవితికి ప్రత్యేకంగా వినాయకుడిపై పాటలు ఆలపించే పనిలో వున్నారు.
