గురువారం, 13 నవంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శనివారం, 9 ఆగస్టు 2025 (16:22 IST)

Rajamouli: మహేష్ బాబు అభిమానులకు సర్ ప్రైజ్ చేసిన రాజమౌళి

Mahesh babu Locket look
Mahesh babu Locket look
మహేష్ బాబుకు ప్రముఖులందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం ఒకటైతే, రాజమౌళి చెప్పడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు చేస్తున్న సినిమా అప్ డేట్ గురించి అభిమానులతోపాటు సినీఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అందుకే రాజమౌళి ఎక్స్ లో ఓ ఫొటో పోస్ట్ చేశాడు. దీనిని చూశాక అభిమానులు మరింత ఆసక్తి కోసం నవంబర్ వరకు ఆగాల్సిందేనా అంటూ నిట్టూర్పు విడుస్తున్నారు.
 
ఫొటో లో మహేష్ ధరించిన లాక్కెట్ బాగా చూస్తే గుండెలపై రక్తం కనిపిస్తున్నాయి. ఇక ఫైనల్ గా నవంబర్ లో ఫస్ట్ రివీల్ ఉంటుంది కన్ఫర్మ్ చేశారు. మొత్తానికి మాత్రం మహేష్ 50వ పుట్టినరోజు అభిమానులకోసం తన చెస్ట్ ను చూపిస్తూ థ్రిల్ కలిగించాడు. దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి కలయికలో రాబోతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ సినిమాగా రూపొందుతోంది. ఇందులో ఎడ్వంచర్ పరంగా అవతార్ తరహాలో వుంటాయని టాక్ కూడా నెలకొంది.