శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 డిశెంబరు 2025 (13:02 IST)

Rajinikanth Birthday Special: సూపర్ స్టార్ 75వ పుట్టిన రోజు.. 50ఏళ్ల సినీ కెరీర్ ప్రస్థానం (video)

Rajinikanth
Rajinikanth
సూపర్ స్టార్ రజినీకాంత్‌కు నేడు పుట్టినరోజు. 75వ పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన 50 ఏళ్ల సినీ కెరీర్‌లోని ఉత్తమ సినిమాలు ఓటీటీల్లో ట్రెండ్ అవుతున్నాయి. రజినీకాంత్ కెరీర్‌లో ఓ టర్నింగ్ పాయింట్ బాషా మూవీ. అప్పట్లో అదో సంచలనం. అందులో రెండు యాంగిల్స్ ఉన్న పాత్రల్లో తలైవా అదరగొట్టారు. 
 
బాషా ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లే అని డైలాగ్ ఎవర్ గ్రీన్. ఈ సినిమా జనవరి 15, 1995లో రిలీజైంది. అలాగే రజినీకాంత్ సినిమా ముత్తుకు ఇప్పటికీ ఫ్యాన్స్‌లో క్రేజ్ వుంది. ఇందులోని సాంగ్స్, డైలాగ్స్ ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. ముత్తు సినిమా 1995, అక్టోబర్ 23న విడుదలైంది. 
 
ఇప్పటికీ హారర్ కామెడీ థ్రిల్లర్ సినిమాలకు ఓ ఉదాహరణగా చెప్పుకునే గొప్ప మూవీ చంద్రముఖి. ఇందులో డాక్టర్ శరవణన్ గా రజినీకాంత్ చేసే సందడి అదిరిపోయింది. నిజమైన స్నేహానికి అర్థం చెప్పే మూవీ దళపతి. 
 
మహా భారతంలోని కర్ణుడు, దుర్యోధనుడు స్నేహం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. దళపతి మూవీ 1991లో రిలీజైంది. ఇందులో రజినీకాంత్, మమ్ముట్టి కలిసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఇవే కాకుండా కాలా, దర్బార్, జైలర్ లాంటి రజినీకాంత్ సినిమాలనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. 
Rajinikanth Birthday Special
Rajinikanth Birthday Special
 
రజనీకాంత్ జననం డిసెంబర్ 12, 1950, బెంగళూరులో జన్మించారు. తమిళ సినిమా రంగంలోని ప్రముఖ తారలలో ఒకరిగా రజనీకాంత్ ఎదిగారు. 170 కి పైగా చిత్రాలలో పాత్రలతో, ఆయన హిందీ, తెలుగు, కన్నడ చిత్రాలలో కూడా గణనీయమైన విజయాన్ని సాధించారు. తన ఆకర్షణీయమైన స్క్రీన్ ప్రెజెన్స్.. తలైవర్.. సూపర్ స్టార్ అనే స్థాయికి ఎదిగేలా చేశారు.