సంబంధిత వార్తలు
- విజయ్ ప్రభుత్వ ఏర్పాటు యత్నం, రజినీకాంత్ అకస్మాత్తుగా స్టాలిన్‌ను కలిశారు, ఎందుకని?
- RB Choudhary : సూపర్ గుడ్ ఫిల్మ్ అధినేత, నిర్మాత ఆర్బీ చౌదరి దుర్మరణం
- Pooja Hegde: దళపతి విజయ్ గెలుపు ముందుగానే చెప్పిన పూజా హెగ్డే
- Rajanikanth: రజినీకాంత్ భాషా చిత్రం చిరంజీవి ఎలా మిస్ అయ్యారో తెలుసా !
- Vijay cycle yatra, అభిమాని పూలచెండు వేస్తే బాంబు వేశాడేమోనని సైకిలి వదిలేసి విజయ్ పరుగో పరుగు, వీడియో
వందో చిత్రాన్ని తీయాలని భావించారు : ఆర్బీ చౌదరి మృతిపై రజనీకాంత్
సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించే వందో చిత్రాన్ని తనతో తీయాలని ఆ నిర్మాణ సంస్థ అధినేత, దిగ్గజ నిర్మాత ఆర్.బి.చౌదరి భావించారని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఈ నెల 5వ తేదీ మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్.బి.చౌదరి ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. చెన్నైకు తీసుకొచ్చిన ఆయన పార్థివదేహానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ గురువారం నివాళులు అర్పించారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ, ఆర్బీ చౌదరి ఆకస్మిక మృతి చిత్రపరిశ్రమకు తీరని లోటన్నారు. ఆయన తన 100వ సినిమాను తనతోనే తీయాలని అనుకుంటున్నట్టు చెప్పారని, అందుకు తాను అంగీకరించానని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.
'నాలుగు నెలల క్రితం 'జైలర్ 2' షూటింగులో ఉన్నప్పుడు ఆయన నన్ను కలిశారు. 'నేను 99 సినిమాలు పూర్తి చేశాను. 100వ సినిమా తీసి రిటైర్ అవ్వాలనుకుంటున్నాను. ఆ సినిమాలో మీరే నటించాలి. నా దగ్గర రెండు, మూడు కథలున్నాయి, మీరు తప్పకుండా ఈ సినిమా చేయాలి' అని అడిగారు. దానికి నేను 100 శాతం చేస్తానని మాట ఇచ్చాను" అని రజనీకాంత్ వివరించారు. ఆర్బీ చౌదరితో తాను ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ, ఆయన తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని తెలిపారు.
'దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పినట్టు ఆర్బీ చౌదరి ఎందరో దర్శకులను సృష్టించారు. ఇండస్ట్రీని నిలబెట్టి, ఎందరో టెక్నీషియన్లకు ఉపాధి కల్పించిన గొప్ప వ్యక్తి' అని రజనీ కొనియాడారు. 99 సినిమాలు నిర్మించినా ఏనాడూ సమస్యలు ఎదుర్కోలేదని, ఒకవేళ సమస్య వచ్చినా నేరుగా సంబంధిత వ్యక్తి ఇంటికే వెళ్లి పరిష్కరించే గొప్ప వ్యక్తి అని గుర్తుచేసుకున్నారు.
'ఆయన ఎప్పుడూ సంతోషంగా ఉండేవారు. దాని రహస్యం ఏంటని అడిగితే 'నా పరిమితులు నాకు తెలుసు, ఆ పరిధిలోనే సినిమాలు చేస్తాను. దేవుడిపై భారం వేసి మరో ప్రాజెక్టుకు వెళ్లిపోతాను' అని చెప్పేవారు. ఇంత మంచి వ్యక్తి ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం' అని రజనీ ఆవేదన వ్యక్తం చేశారు.
