1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rakasa filmed as a fantasy-adventure, is going to be something fresh: Manasa Sharma.

Manasa Sharma: ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన రాకాస కొత్తగా ఉండబోతుంది : మానస శర్మ

Director Manasa Sharma
Director Manasa Sharma
వెబ్ సిరీస్‌కి, సినిమాకి ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ ఒకేలా ఉంటుంది..రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు. ఈ సినిమా అవుట్ పుట్ నిహారిక గారికి నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. ఈ కథని పదిహేను నిమిషాలు నెరేట్ చేసిన తరువాత నిహారిక గారికి చాలా కాన్పిడెంట్ వచ్చేసి ఓకే చెప్పారు అని దర్శకురాలు మానస శర్మ చెప్పారు.
 
జీ స్టూడియోస్ స‌మ‌ర్ప‌ణలో నిహారిక కొణిదెల త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ చిత్ర విశేషాల్ని దర్శకురాలు మానస శర్మ తెలియజేశారు.
 
- మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తరువాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్‌లతో తీసిన ‘రాకాస’ చాలా కొత్తగా ఉండబోతుంది.
 
- ‘రాకాస’ని ఫాంటసీ, అడ్వెంచర్, కామెడీ జానర్లో తీశాం. ఇప్పటికే అందరూ మా టీజర్‌ని చూసి ఉంటారు. త్వరలోనే ట్రైలర్ రానుంది. అప్పుడు మా సినిమా గురించి ఇంకా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. కామెడీని ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ మూవీని తీశాం.
 
- ‘రాకాస’ కథని ముందుగా నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ చాలా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి సంగీత్ వచ్చారు. సంగీత్ అద్భుతమైన నటుడు. మంచి వ్యక్తి. అతని కామెడీ టైమింగ్ అంటే నాకు చాలా ఇష్టం.
 
- ముందు నుంచీ మేం బడ్జెట్‌లోనే సినిమా తీయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం.
 
- ‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఉంటుంది. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది.  
 
- సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటుంది. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైం కలిసి వచ్చింది.
 
- నిహారిక గారు అనుదీప్ గారిని సజెస్ట్ చేశారు. అనుదీప్ మాకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికే టీజర్‌కు ఆయన ఇచ్చిన ఆర్ఆర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆయన ఈ చిత్రానికి ప్రధాన బలం.
 
- నిహారిక గారితో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యం అవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతోంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక గారు మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు.
 
-  ప్రస్తుతం కొన్ని కథలు, ఐడియాలు ఉన్నాయి. ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా అందులో కామెడీ ప్రధానంగా,ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటాను. ‘రాకాస’ తరువాత వాటి గురించి చెబుతాను.
తర్వాతి కథనం
Samantha: దీవాన మూవీ లో ప్రేమ సాంగ్ రిలీజ్ చేసిన సమంత