రామ్ చరణ్ - ఉపాసన కవల పిల్లల పేర్లు ఏంటో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు ఇటీవల కవల పిల్లలకు జన్మనిచ్చారు. తాజాగా ఆ కవల పిల్లలకు పేర్లు పెట్టారు. కుమారుడికి శివరామ్, కుమార్తెకు అన్వీరా దేవి అంటూ నామకరణం చేసి, బారసాల కూడా పూర్తి చేశారు. ఈ ఫోటోలను మెగాస్టార్ చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
కాగా, తన ఇద్దరు పిల్లలకు పెట్టిన పేర్లను చెర్రీ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అబ్బాయి పేరు శివరామ్, అమ్మాయి పేరు అన్వీరా దేవి అని పేరు పెట్టినట్టు చెప్పారు. వారికి ఈ పేర్లు పెట్టడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు.
పిల్లల పేర్లు వినగానే ఆధ్యాత్మిక భావం కలిగేలా ఉండాలని అనుకున్నాం. మా అమ్మానాన్న సలహాలు తీసుకున్నాం. మా అబ్బాయి పేరు శివరామ్. శివుడు, రాముడు పేర్లు కలిసి వచ్చేలా పెట్టాం. అలాగే, మా నాన్న పేరు శివశంకర వరప్రసాద్ పేరు కలిసివచ్చేలా పేరు పెట్టారు.
ఇక కుమార్తె పేరు అన్వీరా దేవి. అన్... అంటే అపరిమితమైన, వీర అంటే ధైర్యం. దేవి అంటే దైవిక శక్తి. అపరితమైన ధైర్యాన్ని, దైవిక శక్తిని సూచించేలా ఈ పేరు పెట్టాం అని చెర్రీ వివరించారు. కాగా, ఈ పేర్లపై చిరంజీవి దంపతులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాగా, గత 2012లో రామ్ చరణ్ - ఉపాసన దంపతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి 2023లో క్లీంకార అనే పాప జన్మించింది. 2026లో వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ కవలలు జన్మించారు.