1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ram Charan's Peddi mints over 40000 tickets sale per Hour in Online

ఆన్‌లైన్ టిక్కెట్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డు.. గంటకు 40 వేల టిక్కెట్లు విక్రయం

Ram Charan's 'Peddi Powerplay Tour Poster
రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొంది, గురువారం ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన పెద్ది చిత్రం ఆన్‌లైన్ టిక్కెట్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పుతోంది. ఈ చిత్రం గంటకు 40 వేల టిక్కెట్లు అమ్ముడు పోతున్నాయి. 
 
ఈ చిత్రం రిలీజ్‌కు ముందు నుంచే టికెట్‌ బుకింగ్స్‌లో జోరు చూపిన చిత్రం విడుదల అనంతరం కూడా అదే కొనసాగిస్తోంది. ప్రముఖ టికెట్‌ బుకింగ్‌ యాప్‌ 'బుక్‌ మై షో'లో ''పెద్ది''కు గంటకు 40 వేల టికెట్స్ బుక్ అవుతున్నాయి. 2023లో బుక్‌మై షో ప్రవేశపెట్టిన 'అవర్లీ ట్రెండింగ్' (గంటల వారీ ట్రెండింగ్) ఫీచర్ తర్వాత.. ఈ 40 వేల మార్క్‌ను దాటిన చిత్రాల జాబితాలో ఇప్పటివరకు మూడు సినిమాలు మాత్రమే ఉన్నాయి. కల్కి 2898 ఏడీ, సలార్‌, పుష్ప తర్వాత స్థానంలో 'పెద్ది' నిలిచింది. మొదటిరోజే ఈ మార్క్‌ను చేరుకొని రికార్డు సృష్టించింది. 
 
కర్ణాటకలో జరిగిన ప్రీమియర్ షోల ద్వారా 'పెద్ది' భారీ వసూళ్లను సాధించి, టాలీవుడ్‌లోని పలు అగ్రహీరోల చిత్రాల రికార్డులను తిరగరాసింది. ప్రీమియర్స్‌లో రూ.3.2 కోట్లు వసూలు చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో అక్కడ ప్రీమియర్ కలెక్షన్స్ సాధించిన మొదటి తెలుగు సినిమాగా నిలిచింది. గతంలో విడుదలైన 'ఓజీ' (రూ.2.72 కోట్లు), 'రాజా సాబ్‌' (రూ.2.61 కోట్లు), 'పుష్ప-2' (రూ.2.55 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
పొత్తుతో వస్తున్నారా, సింగిల్‌గానా? పవన్‌పై ప్రకాష్ రాజ్ ట్వీట్: నీకెందుకురా అంటూ బండ్ల గణేష్ ఫైర్