సంబంధిత వార్తలు
- స్త్రీలను ఆకర్షణ వస్తువులుగా చూపిస్తున్నారు : నిత్యా మీనన్
- జాన్వీ కపూర్ ట్రాక్‌ను తప్పుగా అర్థం చేసుకున్నారు : బుచ్చిబాబు
- పెద్దిలో రామ్ చరణ్ నటన అద్భుతం : అల్లు అర్జున్
- Peddi Thanks meet: హిట్ అవ్వాలనే కసితో పెద్ది సినిమా చేశా, ప్రేక్షకులు దీవించారు : రామ్ చరణ్
- Peddi contravercy : రాంచరణ్ పెద్ది మూవీ పై స్పందించని ప్రముఖులు, దర్శకుడు క్షమాపణ ?
కనకవర్షం కురిపిస్తున్న రామ్ చరణ్ 'పెద్ది'
బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'పెద్ది'. ఈ చిత్రం ఈ నెల 4వ తేదీన విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. భారీ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కేవలం ఆరు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.332 కోట్ల మేరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో చిత్రం నిర్మాణ సంస్థ వృద్ధి సినిమాస్ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది.
ఈ భారీ విజయంతో పాటు వసూళ్లపట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. సినిమాలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకులు, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు దక్కుతున్న విషయం తెల్సిందే. ఆయన కేరీర్‌లో ఇదొక మైలురాయి మూవీగా నిలిచిందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. దీనికితోడు ఆస్కార్ విజేత రెహ్మాన్ అందించిన పాటులు, బీజీఎం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిందంటూ విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
