Ranabali Lunch : రణబాలి లంచ్ మీట్ - త్వరలో ట్రైలర్ తో ముందుకు వస్తున్నాం
Updated: Thu, 1 Oct 2026 (18:52 IST)
రణాబాలి మాసానికి స్వాగతం అంటూ విజయ్ దేవరకొండ, రష్మిక, దర్శకుడు రాహుల్ కుటుంబం కలిసి సెట్లో లంచ్ మీట్ సందర్భంగా ఫొటోను షేర్ చేశారు. అందులో రాగి సంకటి, రొట్టెలు, కూరలతో భోజనం చేస్తూ సినిమాగురించి త్వరలో అందరం కలుద్దాం అంటూ వివరించారు. ఈ చిత్రం వివిధ భాషలకు చెందిన వారితో చిత్రీకరణ జరిపింది, ఇంకా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మీ ముందుకు రానున్నాయి.
విజయ్ దేవరకొండ హీరోగా తన భార్య రష్మిక మందన్న దేవరకొండ హీరోయిన్ గా దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కించిన అవైటెడ్ యాక్షన్ డ్రామా రణబాలి కోసం అభిమానులు ఆడియన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా దసరా కానుక విడుదలకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ గ్యాప్ లో మేకర్స్ కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు వదులుతూ సినిమాపై హైప్ పెంచుతున్నారు. సినిమా థియేట్రికల్ ట్రైలర్ కి డేట్ లాక్ అయినట్టుగా తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ఈ అక్టోబర్ 8న విడుదల చేస్తున్నట్టుగా సమాచారం. సో దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావలసి ఉంది ఇక ఈ చిత్రానికి అజయ్, అతుల్ లు సంగీతం అందించక మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.
దేవీ (మురళీకృష్ణ)
నిక్‌నేమ్- శక్తిమాన్
సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక......
మరింత చదవండి