శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2016 (11:02 IST)

కాంట్రవర్సీలో ''చారుశీల'': జూలీ గణపతిని కాపీ కొట్టారు... శూర్పణక టైటిల్‌తో నమిత, రాశితో చేయాలనుకుంటే..?

చారుశీల సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తమిళంలో సూపర్ హిట్ మూవీ జూలీ గణపతి రైట్స్‌ను కొన్నారు. ఈ సినిమాకు బాలు మహేంద్ర దర్శకుడు. ఇందులో

చారుశీల సినిమా కాంట్రవర్సీలో చిక్కుకుంది. ప్రణతి క్రియేషన్స్ సంస్థ అధినేత, నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ తమిళంలో సూపర్ హిట్ మూవీ జూలీ గణపతి రైట్స్‌ను కొన్నారు. ఈ సినిమాకు బాలు మహేంద్ర దర్శకుడు. ఇందులో జయరామ్, సరిత హీరోహీరోయిన్స్‌గా నటించారు. ఈ సినిమాను రీమేక్ చేద్దామనుకున్నారు. ఇంతలో ఈ సినిమాలోని సన్నివేశాలు ''చారుశీల'' సినిమాలో కనిపించాయ్. ఇక కూనిరెడ్డి షాక్ తిన్నారు. 
 
దీనిపై నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ కోర్టుకెక్కారు. అంతేగాకుండా ఇమేజ్ ఉన్న నటీనటులతో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అయితే చిత్ర పరిశ్రమలో కొందరు ప్రముఖులు ఈ సినిమా కథను దొంగలించి జూలీ గణపతి సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని కాపీ కొట్టారు. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకులు, నిర్మాతలకు తెలిపినా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించారు. 
 
చివరికి చారుశీల చిత్రాన్ని రిలీజ్ చేసే తేదీని ప్రకటించడం జరిగింది. ఇప్పటికే పది చిత్రాలకు డబ్బింగ్, రీమేక్ రైట్స్ నిర్మాతగా రాణించాను. ఇక జూలీ గణపతి చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, రీమేక్ రైట్స్ కూడా తీసుకున్నాను. ఇక సినిమాను రీమేక్ చేద్దాం అనుకున్నాను. శూర్పణక అనే టైటిల్ కూడా రిజస్టర్ చేయించాను. హీరోయిన్ నమితకు ఈ కథ వినిపించాను. రాశితో కూడా చేద్దామనే ఆలోచన వచ్చింది.
 
కానీ డమరకం శ్రీనివాస్ రెడ్డి ఈ కథను అడగడంతో తామే ఈ సినిమాను రీమేక్ చేసే ఉద్దేశంలో ఉన్నట్లు చెప్పాం. వి.శ్రీనివాసరెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ.. జోత్స్న ఫిలిమ్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు వి.సాగర్, శిద్దిరెడ్డి జయశ్రీ అప్పారావు సంయుక్తంగా నిర్మించిన సినిమా "చారుశీల''లో జూలీ గణపతికి సంబంధించిన సీన్లున్నాయని, ఎవరికి చెప్పినా లాభం లేకపోవడంతో.. కోర్టుకు వెళ్ళాల్సి వచ్చింది.. ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందన్నారు.
 
అయితే చారుశీల సినిమా ఆగస్టు 18న  రిలీజ్ తేదీని ప్రకటించారు. 3 నెలల పాటు ఎంత జరుగుతున్నా.. ఎవ్వరికీ ఏమీ చెప్పలేదు. ఈలోగా చారుశీల టీజర్‌ను రిలీజ్ చేశారు. తన సినిమాను పోలిన సన్నివేశాలు చారుశీల టీజర్లో ఉన్నాయి. ఇన్ని చిత్రాలు నిర్మించి నిర్మాతగా పేరున్న తన తీసుకున్న సినిమా రైట్స్ పక్కనబెట్టి, చిత్రాన్ని కాపీ కొట్టారు. అదే సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది. సినిమాలో ప్రతి సీన్ కాపీ కొట్టారు. తనను పట్టించుకోకుండా చారుశీల చిత్రానికి రిలీజ్ డేట్స్ ప్రకటించారు. కాగా రష్మీ గౌతమ్, రాజీవ్ కనకాల, జశ్వంత్ ప్రధాన పాత్రధారులుగా చారుశీల తెరకెక్కుతున్న నేపథ్యంలో జూలీ గణపతి రీమేక్ రైట్స్‌పై ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన నిర్మాత కూనిరెడ్డి శ్రీనివాస్ సంగతి ఏమౌతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.