1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rashmika Mandanna Recovers; Maisa movie Release Date Announced

Rashmika Mandanna: కోలుకున్న రష్మిక మందన్నా, మైసా చిత్రం రిలీజ్ డేట్ ప్రకటన

Rashmika Mandanna as Maisa
Rashmika Mandanna as Maisa
గోండ్ గిరిజన మహిళ పాత్ర పోషిస్తున్న రష్మిక మందన్న చిత్రం మైసా. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ నిర్మిస్తోంది. కాగా, నేడు మేకర్స్ రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 27, 2026న ‘మైసా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. 
 
 
పోస్టర్‌లో రష్మిక ఒక పెద్ద ఈటె పట్టుకుని నిలబడి ఉండగా, ఆమె ముఖంపై యుద్ధ గాయాలు కనిపిస్తాయి. ఆమె వెనుక భారీ జనసమూహం, మండుతున్న పరిసరాలు ఇంటెన్స్ గా ఉన్నాయి. ఈ పోస్టర్‌కు స్ట్రాంగ్ పీరియడ్-యాక్షన్ లుక్ ఇస్తుంది.
 
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘మైసా’ కొత్త బెంచ్‌మార్క్‌లను క్రియేట్ చేసేలా హై-ఆక్టేన్ స్టంట్ కొరియోగ్రఫీతో రూపొందుతోంది. ఫియర్స్, అడ్రినలిన్-పంపింగ్ అనుభూతిని అందించేలా సినిమాను రూపొందిస్తున్నారు. ఫిమేల్ లీడ్ సినిమాలకే కాకుండా భారతీయ యాక్షన్ జానర్ కి  కొత్త స్థాయికి తీసుకెళ్లేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
 
ఇటీవల సెట్స్‌లో ఓ హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తుండగా గాయపడిన రష్మిక మందన్న..పాత్ర కోసం తన అంకితభావం, పట్టుదలను చూపించారు. ఆమె కోలుకుని షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇంకా 12 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది.
 
పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అద్భుతమైన విజువల్ స్పెక్టకిల్‌ను అందించేందుకు అడ్వాన్స్‌డ్ వీఎఫ్‌ఎక్స్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. దీనికి పవర్‌ఫుల్, పల్స్-పౌండింగ్ ఒరిజినల్ స్కోర్ మరింత బలాన్ని చేకూర్చనుంది.
 
ఈ చిత్రంలో ఈశ్వరి రావు, గురు సోమసుందరం, రావు రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా శ్రేయాస్ పి. కృష్ణ, మ్యూజిక్ కంపోజర్‌గా జేక్స్ బిజోయ్ పని చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్టంట్ స్పెషలిస్ట్ ఆండీ లాంగ్ యాక్షన్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.  
 
‘మైసా’ తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
అలా చేస్తే ప్రతి కథ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది : దర్శకుడు శివ నిర్వాణ