1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ravi Mohan - Aarti Divorce row : Madras High Court intervenes in the dispute

రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు : హైకోర్టులో ఆర్తి పిటిషన్

Kenisha Breaks Up With Jayam Ravi
కోలీవుడ్ స్టార్ రవి మోహన్‌‍పై ఆయన సతీమణి ఆర్తి సంచలన ఆరోపణలు చేశారు. విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన తర్వాత రోజువారీ ఖర్చులకు కూడా డబ్బులు ఇవ్వడం లేదని ఆర్తి రవి ఆరోపించారు. ఈ మేరకు మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. పిల్లల పోషణ, స్కూలు ఫీజుల చెల్లింపు విషయంలో వీరి మధ్య ఉన్న వివాదంపై కోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. 
 
గత ఏప్రిల్ 2025 నుంచి జయం రవి తన పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర నిర్వహణ ఖర్చులకు పైసా కూడా ఇవ్వడం లేదని ఆర్తి హైకోర్టును ఆశ్రయించారు. దీనివల్ల పిల్లల చదువుకు, రోజువారీ అవసరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ అత్యవసర పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఈ విషయాన్ని వెంటనే తేల్చాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. వచ్చే రెండు వారాల్లోగా ఈ మధ్యంతర భరణం పిటిషన్‌పై విచారణ పూర్తి చేసి, తగిన ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. 
 
మరోవైపు, ఈ ఆరోపణలపై రవి మోహన్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. సింగర్ కెనీషా తన నుంచి దూరమవుతున్నట్టు ప్రకటించినప్పటికీ ఆర్తి తనను, తన స్నేహితులను మరింత వేధిస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలతో బంతి మళ్లీ ఫ్యామిలీ కోర్టు పరిధిలోకి వచ్చింది. ఈ హై ప్రొఫైల్ సెలబ్రిటీ విడాకుల కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోనని అటు అభిమానులు, ఇటు తమిళ చిత్ర పరిశ్రమ ఆసక్తిగా గమనిస్తోంది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
Peddi Collections: పెద్ది మొదటి వారానికి ఓజీ, మహావతార్ నరసింహ కంటే వెనుకబడిందా ?