1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Ravi Mohan Injambakkam bungalow seized: Bank officials paste notice; Financial disputes stir controversy

11 నెలల పాటు ఈఎంఐ కట్టలేదు.. వేలానికి రవి మోహన్ ఇల్లు.. నోటీసులు అంటించేశారు..

Jayam Ravi
Jayam Ravi
ప్రముఖ తమిళ నటుడు జయం రవి ఇల్లు వేలానికి సిద్ధమైంది. 11 నెలల పాటు ఈఎంఐ కట్టకపోవడంతో చెన్నై, ఇంజంబాక్కంలోని ఆయన ఇంటిని ఓ ప్రైవేట్ బ్యాంకు వేలం వేయడానికి సిద్ధమైంది. తీసుకున్న రుణానికి సంబంధించిన వాయిదాలు చెల్లించకపోవడంతో, బ్యాంకు అధికారులు ఆయన ఇంటికి వేలం నోటీసులు అంటించారు. ఈ ఘటన కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. జయం రవి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ ఇంటి కోసం రవి మోహన్ ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి పెద్ద మొత్తంలో రుణం తీసుకున్నాడు. అయితే నెలవారీ వాయిదాలను సకాలంలో చెల్లించడంలో విఫలమయ్యాడు. దీంతో బకాయిలు రూ.7.60 కోట్లకు పైగా పేరుకుపోయినట్లు బ్యాంకు జారీ చేసిన నోటీసులో స్పష్టం చేసింది. 
 
జయం రవి మరో వివాదంలో కూడా చిక్కుకున్నారు. టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ ఆయనపై తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తమ సంస్థలో రెండు సినిమాలు చేసేందుకు గాను ఆయన రూ.6 కోట్లు అడ్వాన్స్‌గా తీసుకున్నారని, కానీ ఆ చిత్రాల్లో నటించకుండా ఇతర ప్రాజెక్టులకు వెళ్లిపోయారని ఆ సంస్థ ఆరోపిస్తోంది.
తర్వాతి కథనం
గుజరాత్ బ్రాండ్ కాన్‌ప్లెక్స్ సినిమాస్ ప్రారంభించిన స్పీకర్, సిద్దు జొన్నలగడ్డ