శుక్రవారం, 23 జనవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవి
Last Updated : బుధవారం, 10 డిశెంబరు 2025 (18:42 IST)

Raviteja: రవితేజ, డింపుల్ హయతి.. భర్త మహాశయులకు విజ్ఞప్తి నుంచి మెలోడీ సాంగ్

Ravitēja, ḍimpul hayati, bharta mahāśayulaku vijñapti nun̄ci melōḍī sāṅg, sudhākar cerukūri, āṣikā raṅganāth, kapil kapilan 117 / 5,000 Ravi Teja, Dimple Hayati
Ravitēja, ḍimpul hayati, bharta mahāśayulaku vijñapti nun̄ci melōḍī sāṅg, sudhākar cerukūri, āṣikā raṅganāth, kapil kapilan 117 / 5,000 Ravi Teja, Dimple Hayati
మాస్ మహారాజా రవితేజ, కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి'తో అలరించబోతున్నారు . SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని  హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. జీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. ఇందులో రవితేజ సరసన ఆషికా రంగనాథ్‌ , డింపుల్ హయతి కథానాయికలుగా నటిస్తున్నారు. ఫస్ట్ సింగిల్  బెల్లాబెల్లా  చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ప్రోమోతో టీజ్ చేసిన తర్వాత మేకర్స్ ఈరోజు అద్దం ముందు లిరికల్ వీడియోను  రిలీజ్ చేశారు.
 
భీమ్స్ సిసిరోలియ  ఓ మధురమైన మెలోడియస్‌ ట్రాక్‌ను అందించారు. మనసును హత్తుకునే బీట్‌లు, శ్రేయా ఘోషాల్‌ ఆకట్టుకునే వాయిస్ కలగలిపి పాటను మరింత మ్యాజికల్ మార్చాయి. కపిల్‌ కపిలన్‌ వాయిస్ మాధుర్యాన్ని పెంచింది.  ప్రేమలో ఉన్న జంటల  మనసుల మాటలను చంద్రబోస్ అద్భుతంగా రాశారు. ఒకరి కోసం ఒకరు మాత్రమే ఉన్నట్టుగా వారి ప్రేమలో ప్రతి క్షణాన్ని ఆప్యాయంగా, ఆత్మీయంగా చిత్రించే పాట ఇది. అద్దం ముందు సాంగ్ హస్బెండ్–వైఫ్‌ తమ ప్రేమను వ్యక్తం చేసుకునే అద్భుతమైన మెలోడీ సాంగ్ గా అలరిస్తోంది.
 
ఈ సాంగ్ లో విజువల్స్‌..  విజువల్‌ ఫీస్ట్‌ లా వున్నాయి. శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీలో, యూరప్‌ అందమైన లొకేషన్ల మధ్య తెరకెక్కిన ఈ పాటలో రవితేజ–డింపుల్‌ హయాతి కెమిస్ట్రీ అదిరిపోయింది. వారి రొమాంటిక్‌ మోమెంట్స్‌, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌, ప్లేఫుల్‌ ఇంటరాక్షన్స్‌ ఇవన్నీ కలిసి పాట కన్నుకపండగలా వుంది.
 
మెలోడియస్ వోకల్స్, అద్భుతమైన సాహిత్యం, మనసు దోచే విజువల్స్‌.. ఈ మూడు కలిసి అద్దం ముందు సాంగ్ మనసుని హత్తుకునే ట్రాక్‌గా నిలబెట్టాయి.
 
ఈ సినిమాకి టాప్ టెక్నికల్ టీం పని చేస్తోంది. సినిమాటోగ్రఫీ ప్రసాద్ మురెళ్ల, జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్.  ..2026 సంక్రాంతికి విడుదల కానుంది.