బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 20 డిశెంబరు 2016 (21:34 IST)

'వంగవీటి' చూస్తే ఏమనిపిస్తుందో... రేవంత్ రెడ్డి

శివ టు వంగవీటి సెలబ్రేషన్స్ ఈవెంట్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వంగవీటి చిత్రం పాటలు విడుదల జరుగుతోంది. కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... శివ సినిమా చూస్తే శివలా మారిపోవాలనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ చిత్రం చూస్తే అమితాబ్ లా

శివ టు వంగవీటి సెలబ్రేషన్స్ ఈవెంట్ హైదరాబాదులో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో వంగవీటి చిత్రం పాటలు విడుదల జరుగుతోంది. కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... శివ సినిమా చూస్తే శివలా మారిపోవాలనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్ చిత్రం చూస్తే అమితాబ్ లా మారిపోవాలనిపిస్తుంది. ఇప్పుడు వంగవీటి చిత్రం చూస్తే ఏమనిపిస్తుందో అని తెదేపా నాయకుడు రేవంత్ రెడ్డి అన్నారు.
 
ఇంకా ఆయన మాట్లాడుతూ... రాంగోపాల్ వర్మ ఆఖరి చిత్రం వంగవీటి అని అందరూ అంటున్నారనీ, కానీ ఆయన ఇంకా మరిన్ని చిత్రాలు చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ చిత్రం భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నాననీ, చిత్ర యూనిట్ సభ్యులకు అందరికీ శుభాకాంక్షలు అని అన్నారు.