1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Rk Roja Daughter Anshumalika Wins Prestigious Herman B Wells Award in USA

Anshumalika: ఆర్కే రోజా కుమార్తెకు హెర్మన్ బి వెల్స్ అవార్డు

Anshumalika
Anshumalika
ఏపీ మాజీ మంత్రి ఆర్కే రోజా కుమార్తె అరుదైన అవార్డును కైవసం చేసుకున్నారు. అమెరికాలో చదువుకుంటున్న అన్షు మాలికకు ప్రతిష్టాత్మక హెర్మన్ బి వెల్స్ అవార్డును సొంతం చేసుకున్నారు. అన్షు మాలిక ఇప్పటికే 2024లో నైజీరియాలో జరిగిన గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఫెస్టివల్‌లో సోషల్ ఇంపాక్ట్ విభాగంలో అవార్డు కూడా అందుకున్నారు. 
 
ఈ విషయాన్ని మాజీ మంత్రి ఆర్.కె. రోజా తన కుమార్తె అన్షు మాలిక సాధించిన గొప్ప విజయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. అన్షు మాలిక ప్రస్తుతం అమెరికాలోని ఇండియానా యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు. విద్యలో చూపిన అత్యుత్తమ ప్రతిభకు గానూ ఆమెకు ఈ గౌరవం దక్కింది. ఆమె కేవలం చదువులోనే కాకుండా సామాజిక సేవలో కూడా చురుకుగా ఉంటున్నారు. 
 
అన్షు తల్లి బాటలో సినిమాల్లోకి రాకుండా, శాస్త్రవేత్త కావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. “ఫ్లేమ్ ఇన్ మై హార్ట్” అనే పుస్తకాన్ని కూడా ఆమె రాశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
అందరికీ నచ్చేలా సూర్య బి పాజిటివ్ టీజర్ - దర్శకులు కౌశిక్, మురళీకాంత్