Bandla Ganesh: ఓటీటీ వద్దని సాయి, నితిన్‌కు ఫోన్ చేసి థియేటర్‌లో చేయమని చెప్పా : బండ్ల గణేష్
Bandla Ganesh, Sivaji, Laya, Bunny Vasi and others
తమ్ముడు శివాజీ నాకు అత్యంత ఆప్తుడైన వ్యక్తి. యంగ్ బ్యాచ్ అంతా కలిసి ఓ మంచి సినిమాను చేశారు. అలీ అన్న శివాజీ సినిమా ఫంక్షన్‌కు వెళదాం రా అన్నాడు. వెంటనే ఆలోచించకుడా వచ్చాను. గతంలో శివాజీ నిర్మించిన సినిమాలతో పాటు ఆయనతో కలిసి నటించాను. ఇలాంటి పండగ వాతావరణం ఉన్న ఫంక్షన్‌లో పాల్గొనడం నాకు ఉత్సాహంగా ఉంది. ఈ సినిమాలో ఎంతో మంది ప్రతిభ ఉన్న కమెడియన్స్ నటించారు. ఇంత మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఒకే సినిమాలో కనిపించడం చాలా అరుదు. అది ఈసినిమాకు దక్కింది అని బ్రహ్మానందం అన్నారు.
శివాజీ, లయ జంటగా నటించిన సినిమా సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బండ్ల గణేష్ మాట్లాడుతూ '' ఈటీవీవిన్ సంస్థ ఎంతో మంది నూతన ప్రతిభను ప్రోత్సాహిస్తున్నారు. శివాజీ నా ఆత్మబంధువు, సోదరుడు. శివాజీ ఎప్పుడూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. ఈ సినిమా ఓటీటీ అనగానే డిజప్పాయింట్ అయ్యాను. సాయి, నితిన్‌కు ఫోన్ చేసి థియేటర్‌లో విడుదల చేయమని చెప్పాను. అనిల్ రావిపూడి సలహాతో ఈ సినిమా థియేటర్‌లో రావడం ఆనందంగా ఉంది. ఈ సినిమా సూపర్‌హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఈటీవీ విన్ సంస్థ ఇలాగే కొత్తవారిని ఎంకరైజ్ చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు.
ఈ టీవీ విన్ హెడ్ సాయికృష్ణ మాట్లాడుతూ ఈ సినిమాను శివాజీ, లయ గారు ఎంతో బాధ్యతగా, ప్రేమగా తీశారు. ఈ సినిమను అందరూ ఫ్యామిలీతో రండి. ఈసినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువ కావాలని ఫ్యామిలీ టికెట్ కాంబోను ప్రకటించాం. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్‌ను సింగిల్ స్క్రీన్స్‌లో, 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్‌కార్న్‌ను మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు.అందరూ ఈ ఆఫర్‌ను సద్వినియోగపరుచుకోవాలని కోరుకుంటున్నాను' అన్నారు.
కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ, ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంటుది. ఇప్పుడు సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని చిత్రం విషయంలో కూడా అలాంటి ఆసక్తి ఉంది. సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్ వారు థియేటర్‌లో ఈసినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్‌ను సింగిల్ స్క్రీన్స్‌లో, 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్‌కార్న్‌ను మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ ఇలా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించారు ఇందువల్ల సినిమా మరింత మందికి దగ్గరవుతుంది. ఖచ్చితంగా ఈసినిమా ఆడియన్స్‌ను డిజప్పాయింట్ చేయదని ఖచ్చితంగా చెప్పగలను. ఫ్యామిలీ అందరూ కలిసి హ్యపీగా ఈ సినిమాను థియేటర్‌లో ఎంజాయ్ చేయవచ్చు. ఈటీవీ విన్ సాయి, నితిన్, బాపినీడు గారికి నా కృతజ్క్షతలు. ఈ కార్యక్రమానికి బ్రహ్మానందం గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. బండ్ల గణేష్ గారు కూడా అడగ్గానే వచ్చారు. అలీ కూడా తన సొంత సినిమాలా భావించాడు. అందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఈ రోజు ఈ సినిమా అంత మంచి అవుట్‌పుట్ వచ్చింది. అందరికి నా కృతజ్క్షతలు'' అన్నారు.