గురువారం, 27 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 3 మే 2016 (14:41 IST)

అ.. ఆ.. ఆడియోకు పవర్ స్టార్ పవన్ వచ్చారుగా.. ఇక సినిమా హిట్ అంతే: సమంత

తెలుగు ఇండస్ట్రీకి ఏ మాయ చేసావె సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత ప్రస్తుతం దక్షిణాది అగ్ర హీరోయిన్‌గా ఎదిగిపోయింది. టాలీవుడ్ టాప్ హీరోలతో నటించేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం లవర్ బాయ్ నితిన్‌తో అ.. ఆ.. సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో వేడుక హైదరాబాదులో అట్టహాసంగాడ జరిగింది.
 
ఈ కార్యక్రమానికి సమంతనే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. తన డ్రెస్ కోడ్‌తో అదరగొట్టేసింది. ఆడియో ఫంక్షన్లతో పాటు ఇతరత్రా కార్యక్రమాలకు అదరగొట్టే డ్రస్సులతో అందరినీ ఆకట్టుకునే ఈ భామ.. అ.. ఆ.. ఆడియో ఫంక్షన్‌లో మాత్రం కొత్త వెరైటీగా కనిపించింది. సాధారణంగా ఆడియో ఫంక్షన్లకు సమంత వెళ్తే తప్పకుండా బొడ్డు చూపించే డ్రెస్సులకే ప్రాధాన్యత ఇస్తుంది.
 
అయితే అ.. ఆ.. సినిమా ఆడియో వేడుకలో మాత్రం బొడ్డు కనిపించకుండా వెరైటీగా కనిపించింది. కానీ క్లీవేజ్ ఇతరత్రా అందాలను ఎత్తిచూపింది. సింపుల్‌గా సూపర్‌గా అదరగొట్టింది. ఇంకా ఈ ప్రోగ్రామ్‌లో సమంత తెలుగులో మాట్లాడి ప్రేక్షకులను ఆకట్టుకుంది. చివర్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గురించి చర్చించడమే హైలైట్‌గా నిలిచింది. 
 
పవన్ కల్యాణ్ షూటింగ్ స్పాట్‌కు రావడంతో పాటు ఆడియో ఫంక్షన్‌కు వచ్చి మమల్ని బ్లెస్ చేయడంతో సినిమా హిట్ అవుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. సినిమా హిట్ అంతే అంటూ సమంత స్పీచ్‌తో అదరగొట్టేసింది.