సంబంధిత వార్తలు
- 180 మంది బాలికలపై లైంగికదాడి... 350కి పైగా అశ్లీల వీడియోలు.. బీజేపీ ఎంపీ ఫిర్యాదు
- చర్లపల్లి టెక్కీ ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ - అత్తమామలు - బామ్మర్ది వేధింపులు తాళలేక...
- మాయదారి మొగుడు... భార్యకు మత్తుమాత్రలిచ్చి... ప్రియురాలితో రొమాన్స్
- వందే భారత్ రైలులో పురుగుల భోజనం.. భారీ అపరాధం
- మటన్ ఉడకలేదు.. యజమానిపై కేసు నమోదు చేయండి.. ఠాణాలో రచ్చ చేసిన తాడిపత్రివాసి
సింగర్ మంగ్లీని సినీ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి: సంపత్ నాయక్ ఫిర్యాదు
మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో గాయని మంగ్లీ చుట్టూ వివాదం రోజురోజుకీ ముదురుతోంది. ఈరోజు అది ఇంకాస్త ముందుకు సాగింది. తెలంగాణ సినీ కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శి సంపత్ నాయక్, గాయని మంగ్లిని చిత్ర పరిశ్రమ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిర్మాతల మండలికి ఫిర్యాదు చేశారు. నిరుపేదలైన బాధితులకు న్యాయం జరిగే వరకు మంగ్లిని నిషేధించాలని సంపత్ నాయక్ డిమాండ్ చేస్తున్నారు. మైక్రోఫైనాన్స్ ముసుగులో డబ్బు వసూలు చేశారన్న ఆరోపణలపై మంగ్లిపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైన సంగతి తెలిసిందే.
మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో మంగ్లీ ప్రమేయంపై త్వరలో ఆధారాలు బయటపెడతామంటూ సంపత్ నాయక్ చెప్పడం మరింత చర్చనీయాంశంగా మారింది. బాధితులకు న్యాయం జరిగేందుకు తను బైటకు వచ్చి పోరాడుతానని మీడియాతో చెప్పిన మంగ్లీ బయటకు రావాలని డిమాండ్ చేసారాయన. అసలు రమావత్ మధు, మంగ్లీ మధ్య సంబంధాలేంటి అని సూటిగా ప్రశ్నించారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ తాము పోరాటం చేస్తామంటూ సంపత్ నాయక్ వెల్లడించారు.
