Bhogi: శర్వా.. భోగి చిత్రం కోసం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తున్న సంపత్ నంది
Sharwa, Sampath Nandi
ప్రస్తుతం, ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ మన్నె ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌లో హై ఆక్టేవ్ ఎమోషనల్ యాక్షన్ క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోంది. ప్రేక్షకులకు ఒక గొప్ప థియేట్రికల్ అనుభూతిని అందించేలా, స్టంట్ మాస్టర్ దిలీప్ సుబ్బరాయన్ ఈ సన్నివేశాన్ని మునుపెన్నడూ చూడని స్టయిల్ లో రూపొందిస్తున్నారు. ఈ కీలకమైన క్లైమాక్స్ లో శర్వా మోస్ట్ ఇంటెన్స్, రిస్కీ స్టంట్లతో తన నటనలో సరికొత్త కోణాన్ని ప్రజెంట్ చేయబోతున్నారు. సినిమాలోని ఈ కీలక భాగాన్ని పూర్తి చేసే లక్ష్యంతో ఈ షెడ్యూల్ 20 రోజుల పాటు కొనసాగనుంది.
ఈ చిత్రంలో డింపుల్ హయతి మరో కథానాయికగా నటిస్తోంది. 1960ల నాటి నేపథ్యంలో సాగే 'భోగి' చిత్రం, తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులోని ఒక ఫిక్షనల్ విలేజ్ లో జరిగే పీరియడ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషలో ఆగస్టు 28న పాన్-ఇండియా స్థాయిలో భారీగా విడుదల కానున్న 'భోగి', రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఒక అద్భుతమైన బిగ్ స్క్రీన్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది.
నటీనటులు: చార్మింగ్ స్టార్ శర్వా, అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి
