శుక్రవారం, 13 ఫిబ్రవరి 2026
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : గురువారం, 5 ఫిబ్రవరి 2026 (15:03 IST)

Samyuktha: డూప్ లేకుండా ది బ్లాక్ గోల్డ్ కోసం యాక్షన్ చేస్తున్న సంయుక్త

Samyuktha performing action sequences
Samyuktha performing action sequences
తన అందం, నటనతో ఆకట్టుకునే స్టార్ హీరోయిన్ సంయుక్త  ఇప్పుడు యాక్షన్ మోడ్ లోకి మారిపోయింది. ఆమె తన ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ 'ది బ్లాక్ గోల్డ్' కోసం డూప్ లేకుండా భారీ యాక్షన్ సీక్వెన్సులు చేస్తున్నారు. ఈ స్టంట్స్ లో అవుతున్న గాయాలను పట్టించుకోకుండా షూటింగ్ చేస్తున్నారు సంయుక్త. ఈ మూవీలో సంయుక్త చేస్తున్న యాక్షన్ సీక్వెన్సులు హైలైట్ గా నిలవనున్నాయి. సంయుక్త కెరీర్ లో 'ది బ్లాక్ గోల్డ్' ఒక స్పెషల్ మూవీగా నిలవనుంది.
 
పాన్-ఇండియన్ యాక్షన్ డ్రామాగా 'ది బ్లాక్ గోల్డ్' చిత్రాన్ని యోగేష్ కెఎంసి రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని మాగంటి పిక్చర్స్ భాగస్వామ్యంతో హాస్య మూవీస్ బ్యానర్‌పై రజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లోనే ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, రావు రమేష్, నాజర్, మనీష్ వాధ్వా ఇతర కీ రోల్స్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషలలో 'ది బ్లాక్ గోల్డ్' సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు  ప్లాన్ చేస్తున్నారు.