1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Satyadev's look from Samavarthi – an ecological action thriller

Satyadev :ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా సమవర్తి నుంచి సత్యదేవ్ లుక్

Looks of Satyadev from Samavarthi
Looks of Satyadev from Samavarthi
వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు  హీరో సత్యదేవ్. ఆయన హీరోగా "సమవర్తి" అనే ఇంట్రెస్టింగ్ సినిమాలో నటిస్తున్నారు. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న 16వ చిత్రమిది. రుద్ర పిక్చర్స్ బ్యానర్ & పంచభూత ప్రొడక్షన్స్, స్ పై శివచరణ్ రెడ్డి  జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. అజయ్ నాగ్. వి దర్శకత్వం వహిస్తున్నారు. ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళంలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
 
సమవర్తి" సినిమా నుంచి మేకర్స్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో చేతిలో కత్తితో ఇంటెన్స్ లుక్ లో సత్యదేవ్ కనిపించి ఆకట్టుకుంటున్నారు. ఆయన చేతిలోని ఖడ్గంలో చిరుత పులి కనిపించడం, స్వర్గం కూడా మరణాన్ని కోరుతుంది అనే క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది.
 
 ప్రత్యేకంగా ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ అనే కొత్త జానర్ ఈ ప్రాజెక్ట్‌పై మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ పెంచుతోంది. ఈ చిత్రంతో సత్యదేవ్ పూర్తిగా కొత్త జోన్‌లోకి అడుగుపెడుతూ, ఫుల్-ఫ్లెడ్జ్డ్ యాక్షన్ స్పేస్ వైపు గేర్ మార్చారు.
 
నటీనటులు - సత్యదేవ్, దిలీష్ పోతన్, రాజీవ్ కనకాల, గనవి లక్ష్మణ్, రవీంద్ర విజయ్, మోహన్ భగత్, తదితరులు
About Writer
దేవీ